Second Marriage: ఆశిష్ విద్యార్థి రెండవ వివాహంపై మాజీ భార్య రియాక్షన్..

Second Marriage: ఆశిష్ విద్యార్థి రెండవ వివాహంపై మాజీ భార్య రియాక్షన్..

Update: 2023-05-27 06:00 GMT

Second Marriage: ఆశిష్ విద్యార్థి రెండవ వివాహంపై మాజీ భార్య రియాక్షన్..

Second Marriage: ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అసోంకు చెందిన రూపాలి బారువాను ఆశిష్ విద్యార్థి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. షష్టి పూర్తి చేసుకునే వయసులో రెండో వివాహం ఏంటని నెటిజన్స్ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆశిష్-రూపాలి జంటను చూసిన మరికొంత మంది నెటిజన్స్ అయితే ప్రేమ గుడ్డిది అంటే ఏమో అనుకున్నాం..కానీ వీళ్లిద్దరిని చూస్తుంటే నిజమే అనిపిస్తోందని ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇదంతా ఒకెత్తైతే ఆశిష్ రెండో వివాహం పై ఆయన మొదటి భార్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు..

రూపాలితో ఆశిష్ వివాహంపై ఆయన మొదటిభార్య రాజోషి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. జీవితం అనే పజిల్ లో ఎప్పుడు గందరగోళానికి గురి కావద్దని రాజోషి రాసుకొచ్చింది. ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని సందేహాలు పెట్టుకోవదని, ఇక మీదట మీకు ఆ అవసరం రాకపోవచ్చని...ఇంత కాలం మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటూ తన మాజీ భర్త పెళ్లిపై రాజోషి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

రెండో వివాహం పై ఆశిష్ విద్యార్థి వివరణ:

మరోవైపు ఆశిష్ విద్యార్థి తన రెండో వివాహాన్ని సమర్థించుకుంటూ సుదీర్ఘంగా వివరణ ఇస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. భేదాభిప్రాయాలు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయేమో కానీ ఈ క్రమంలో ఎవరో ఒకరు మరొకరి మాట, ఆలోచన, అభిప్రాయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే అని..అప్పుడు ఎవరో ఒకరు సంతోషానికి దూరం అవుతారని ఆశిష్ విద్యార్థి అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆనందం అనేది అందరికీ చెందాలి కదా అంటూ తన రెండో వివాహాన్ని సమర్థించుకున్నారు. తనకు ఒక తోడు కావాలనిపించడంతోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నానంటూ చెప్పుకొచ్చారు. తనకు ఇంకా 60 ఏళ్లు రాలేదని అయినా ప్రేమకు వయసుతో పనేంటి..తామిద్దరం సంతోషంగా కలిసి ప్రయాణిస్తామని తన రెండో పెళ్లి గురించి చెప్పారు. 



Tags:    

Similar News