ఏడ్రస్ వేసుకుంటే మీకేందుకు..నెటిజన్లపై ఆండ్రియా ఫైర్
ఆండ్రియా తమిళంలో కార్తీ నటించిన యుగానికి ఒక్కడు చిత్రంతో తెలుగు అనువాదం కావడంతో ఈ ముద్దు గుమ్మ సినీ ప్రేక్షకులకు పరిచయంమైంది.
ఆండ్రియా తమిళంలో కార్తీ నటించిన యుగానికి ఒక్కడు చిత్రంతో తెలుగు అనువాదం కావడంతో ఈ ముద్దు గుమ్మ సినీ ప్రేక్షకులకు పరిచయంమైంది. ఆ తర్వాత నాగచైతన్య సునీల్ కలిసి నటించిన తఢాఖ చిత్రంలోనూ నటించింది. అడపా దడపా చిత్రాలు చేస్తూ ఉంది. ఇటీవలి కాలంలో ఆమె అసలు సినిమాల్లోనే కనిపించలేదు. తమిళంలో వచ్చినే వడచెన్నై సినిమా తర్వాత నటించలేదు. కొంత కాలం సినిమాలకు విరామం తీసుకున్న తర్వాత మళ్లీ ఆమె బీజీ అయింది. విజయ్ కథానాయకుడీగా చేస్తున్న తాజా చిత్రం ఓ పాత్రల్లో నటిస్తోంది. తమిళంలో కా, వట్టం, మాళిగై చిత్రాల్లో నటిస్తుంది.
తాజాగా తమిళ హీరోయిన్ ఆండ్రియా వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. అయితే ధరించిన దుస్తువులుపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆండ్రియా ఘాటుగా సమాదానం చెప్పింది. తన జీవితంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు గురించి బహిరంగంగా చెప్పుకుంది.ఒక పెళ్లైన వ్యక్తితో సహజీవనం చేసి తప్పు చేశానని ఆవేదనను వ్యక్తం చేసింది. కాగా.. ఆండ్రియా ఇటీవల చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే డ్యాన్స్ వీడియో ఆండ్రియా ధరించిన దుస్తులపై నెటిజన్లు విర్శలు చేస్తున్నారు. దీంతో ఆండ్రియాకు కోపం వచ్చింది. ఎవరైన డాన్స్‌ను మాత్రమే చూడాలని ఎంజాయ్ గానీ, ధరించిన డ్రస్ గురించి కామెంట్స్ పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఆండ్రియా నైజాన్నినెటిజన్లకు చూపించింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆండ్రియా శృంగారభరిత డాన్స్‌తో చేసిన వీడియోను రిలీజ్ చేయడానికి కారణం ఆయుర్వేద వైద్యంతో న్యూ లుక్స్‌తో ఉన్నట్లు అందరికీ తెలియజేయడానికే అనే ప్రచారం సాగుతుంది.