Anasuya Emotional : నా పొగరు, నా దైర్యం మా అమ్మే : అనసూయ
Anasuya Emotional : అనసూయ.. పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. న్యూస్ ప్రజెంటర్ నుంచి స్టార్ యాంకర్ గా ఎదిగింది అనసూయ..
Anchor anasuya
Anasuya Emotional : అనసూయ.. పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. న్యూస్ ప్రజెంటర్ నుంచి స్టార్ యాంకర్ గా ఎదిగింది అనసూయ.. ఒకపక్కా బుల్లితెర పైన అలరిస్తూనే మరోపక్కా మంచి మంచి పాత్రలు దక్కినప్పుడు వెండితెర పైన కూడా అలరిస్తుంది .. క్షణం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో కనిపించి అనసూయలోని కొత్త కోణాన్ని అందరికి పరిచయం చేసింది.. ఈ సినిమా తరవాత అనసూయకి బాగానే అవకశాలు వచ్చినప్పటికీ ఆచితూచి కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది అనసూయ..
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అనసూయ తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని అనుభవాలను షేర్ చేసుకుంది. తానూ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండడానికి తన అమ్మే కారణం అని చెప్పుకొచ్చింది. కోరుకున్న భర్త, పిల్లలతో సమాజంలో ఇలాంటి మంచి పొజిషన్ లో ఉండడం అంటే దానికి తన అమ్మే కారణం అని వెల్లడించింది.. తన కోసం, తన ఇద్దరు చెల్లెళ్ళ కోసం అమ్మ బాగా కష్టపడిందని, ఆమె చాలా దైర్యవంతురాలు అని వెల్లడించింది..తన దైర్యం, పొగరు అన్ని అమ్మే అంటూ ఎమోషనల్ అయింది అనసూయ.. ఒక్కోసారి ఇల్లు అద్దె కట్టలేకా తక్కువ అద్దె ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యే వాళ్ళమని వెల్లడించింది. ఇలాంటి చాలా చూశామని భాగోద్వేగానికి లోనైంది.. ఇక ఆర్ధికంగా చాలా కష్టాలు పడుతున్న సమయంలో 50 పైసలు ఆదా చేయడం కోసం ఏకంగా రెండు బస్టాప్‌లు నడిచి బస్సు ఎక్కేదాన్నంటూ వెల్లడించింది అనసూయ..
ఇక అనసూయ జబర్దస్త్ తో పాటుగా పలు షో లతో బిజీ అయిపొయింది. అంతేకాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో అనసూయకి మంచి పాత్ర దక్కింది. ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. హాస్యనటుడు బ్రహ్మనందం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో కూడా అనసూయ నటిస్తుందని సమాచారం.