Amit Shah Tweet: జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీపై అమిత్ షా ట్వీట్
Amit Shah Tweet: జూ.ఎన్టీఆర్ అత్యంత ప్రభావంతమైన నటుడు
Amit Shah Tweet: జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీపై అమిత్ షా ట్వీట్
Amit Shah Tweet: నోవాటెల్‌లో బీజేపీ అగ్రనేత అమిత్ షా, హీరో జూనియర్ ఎన్టీఆర్ సమావేశమయ్యారు. వీరు ఇద్దరు దాదాపు అరగంట పాటు చర్చించుకున్నారు. సమావేశంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్‌ను అభినందించారు అమిత్ షా. ట్రిపుల్ ఆర్ సినిమాలో నటనపై జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రశంసించారు. మరోవైపు అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇరువురు ఏఏ అంశాలపై చర్చించారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
జూనియర్ ఎన్టీఆర్ భేటీపై కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ప్రభావంతమైన నటుడు అన్నారు ఆయన. తెలుగు సినిమా తారక రత్నం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు అమిత్ షా.