Allu Arjun: నా విజయానికి ఆయనే కారణం.. బన్నీ ఎమోషనల్‌ పోస్ట్‌..!

National Film Awards: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-10-18 07:04 GMT

Allu Arjun: నా విజయానికి ఆయనే కారణం.. బన్నీ ఎమోషనల్‌ పోస్ట్‌..!

National Film Awards: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ తన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

‘జాతీయ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఇంత గొప్ప గుర్తింపునిచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నేను సాధించిన మైలురాయి మాత్రమే కాదు.. మన సినిమాను ఆదరిస్తూ.. సపోర్ట్‌ చేసినవారందరికీ చెందుతుంది. అలాగే దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. నా విజయానికి ఆయనే కారణం’ అని బన్నీ పోస్ట్‌ చేశారు. 


Tags:    

Similar News