అభిమానులలో తొక్కిసలాట.. బన్నీ జంప్‌.. ఫోటో షూట్‌ రద్దు..!

Allu Arjun's Photoshoot: ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప: ది రూల్" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2023-02-08 07:08 GMT

అభిమానులలో తొక్కిసలాట.. బన్నీ జంప్‌.. ఫోటో షూట్‌ రద్దు..!

Allu Arjun's Photoshoot: ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప: ది రూల్" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ అరకు వ్యాలీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైజాగ్ లో బన్నీ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. బన్నీ ఆటోగ్రాఫ్ తో పాటు బన్నీతో ఫోటో కూడా దిగే అవకాశం ఉండేలాగా ఈ ఫ్యాన్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. కానీ ఈ వేడుక అనుకున్నట్లు జరగకుండా పరిస్థితులు చేయి దాటి పోయే విధంగా మారింది.

అల్లు అర్జున్ వచ్చిన వెంటనే అభిమానులు చుట్టూ గూమిగూడారు. ఒకరి తరువాత ఒకరు రాకుండా అభిమానులు అందరూ ఒకేసారి ముందు తమతోనే ఫోటో దిగాలి అంటూ అల్లు అర్జున్ మీద పడ్డారు. దీంతో బన్నీతో పాటు నిర్వాహకులు కూడా షాక్ అయ్యారు. పరిస్థితులు చేయి దాటి తొక్కిసలాట కూడా జరగటం మొదలవటంతో బన్నీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో ఈ ఈవెంట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.

అభిమానులు స్టార్ హీరోల చుట్టూ గూమిగూడడం ఇది మొదటిసారి కాదు. హీరోలు కూడా ఫ్యాన్ మీట్ లు పెట్టుకోవడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా ఫ్యాన్ మీట్లలలో పాల్గొని అభిమానులతో సెల్ఫీలు దిగారు. కానీ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో ఇలాంటి మీటింగ్ అంటే మరికొన్ని సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప: ది రూల్" సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    

Similar News