వరుసగా రెండవసారి రికార్డు సృష్టించిన అల్లు అర్జున్

* గూగుల్ ప్రకారంగా 2022లో మోస్ట్ సెర్చ్ టాలీవుడ్ యాక్టర్ ఎవరో తెలుసా?

Update: 2023-01-19 10:17 GMT

వరుసగా రెండవసారి రికార్డు సృష్టించిన అల్లు అర్జున్

AlluArjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ రోజుకి పెరుగుతూ వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప: ది రైజ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో కూడా బన్నీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించిన బన్నీ తాజాగా ఇప్పుడు మరొక రికార్డును సృష్టించారు. 2022లో గూగుల్ మోస్ట్ సెర్చ్ టాలీవుడ్ యాక్టర్ ల జాబితాలో మొదటి స్థానాన్ని అందుకున్నారు అల్లు అర్జున్.

2021 లో కూడా ఈ స్థానాన్ని అల్లు అర్జున్ సాధించారు. వరుసగా ఇప్పుడు రెండవసారి మళ్లీ గూగుల్ సర్చ్ లిస్టులో టాప్ స్థానంలో ఉండి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఈ జాబితాలో రెండవ స్థానం సూపర్ స్టార్ మహేష్ బాబుకి దక్కింది. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు. ఇక రామ్ చరణ్ నాలుగవ స్థానంలో మరియు ఎన్టీఆర్ ఐదవ స్థానంలో నిలబడ్డారు.

నిజానికి 2021 జాబితాలో చిరంజీవి పేరు కూడా ఉంది కానీ రామ్ చరణ్ ఇప్పుడు 2022 లిస్టులో చిరంజీవి స్థానాన్ని ఆక్రమించారు. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో చాలా వరకు ప్రేక్షకులు గూగుల్ లో ఏ యాక్టర్ గురించి సెర్చ్ చేశారు అనే రికార్డుల ఆధారంగా ఈ జాబితా ను గూగుల్ విడుదల చేసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రెండవసారి కూడా అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలవగా బన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

Tags:    

Similar News