Organic Farming: ఆర్గానిక్ వ్యవసాయంపై బన్నీ ఫోకస్
Organic Farming: టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు.
Organic Farming: ఆర్గానిక్ వ్యవసాయంపై బన్నీ ఫోకస్
Organic Farming: టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బన్నీ. ఒకదాని తర్వాత మరొకటి బ్లాక్బస్టర్ లను అందిస్తుంది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ముందుకు దూసుకుపోతున్న అల్లు అర్జున్ ఇప్పుడు వ్యక్తిగత విషయాల వల్ల కూడా వార్తల్లోకి ఎక్కారు. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకర్ పల్లి లో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఈ రెండు ఎకరాల భూమిలో అల్లు అర్జున్ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయబోతున్నారని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఎక్కువ శాతం అడవిలోనే ప్రకృతికి దగ్గరగా గడపాల్సి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి ప్రకృతి, వ్యవసాయం పైన బాగా ఇష్టం పెరిగిందట. దీంతో బన్నీ స్వయంగా సేద్యం చేయడానికి నిర్ణయించుకున్నారు. త్వరలోనే అల్లు అర్జున్ ఆర్గానిక్ వ్యవసాయం చేసి అందరినీ ఆకట్టుకోబోతున్నారు. ఇక ఈ భూమి కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి అయిపోయాయి.