Allu Arjun Ala Vaikunthapurramuloo : బన్నీ అల వైకుంఠపురములో.. ఆల్ టైం రికార్డు!
Allu Arjun Ala Vaikunthapurramuloo : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'..
Allu Arjun Ala Vaikunthapurramuloo sets an all-time high TRP rating in television
Allu Arjun Ala Vaikunthapurramuloo : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు, తమన్ సంగీతం ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. ఇండస్ట్రీ లోనే అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలచింది ఈ సినిమా...
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్రం టీవీలో ప్రసారం అయింది.. బుల్లితెర పైన ఈ సినిమా అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సంపాదించి రికార్డు బ్రేక్ చేసింది. దీనికి ముందు మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు' చిత్రం టాలీవుడ్‌లో అత్యధిక టీఆర్‌పీ మూవీగా 23.4 టిఆర్‌పిని సాధించింది. అయితే దీనిని అల వైకుంఠపురములో చిత్రం బ్రేక్ చేసింది. దీనితో తమ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు గాను చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైనా గీతా ఆర్ట్స్ సంస్థ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే ఓ సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.