Allu Aravind: యువ హీరోతో అల్లు అరవింద్ బిజినెస్ డీల్..
Allu Aravind: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ మంచి బిజినెస్ మాన్ కూడా.
Allu Aravind: యువ హీరోతో అల్లు అరవింద్ బిజినెస్ డీల్..
Allu Aravind: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ మంచి బిజినెస్ మాన్ కూడా. టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందు ఉండే అల్లు అరవింద్ మంచి క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్లతో ఒకేసారి కొన్ని సినిమాలు సైన్ చేయించేసుకుంటారు. "హ్యాపీడేస్" సినిమా తర్వాత తమన్నాతో కొన్ని సినిమాలు సైన్ చేయించిన అల్లు అరవింద్ కార్తికేయ, కిరణ్ అబ్బవరం వంటి యువ హీరోలకు కూడా మంచి అవకాశాలు ఇచ్చారు.
తాజాగా ఇప్పుడు అల్లు అరవింద్ కన్ను యువ హీరో నిఖిల్ సిద్ధార్థ పై పడింది. "కార్తికేయ 2" మరియు "18 పేజెస్" వంటి సినిమాలు చూసి నిఖిల్ సిద్ధార్థ స్టోరీస్ సెలక్షన్ పై అల్లు అరవింద్ కి బాగా నమ్మకం కుదిరింది. దీంతో అల్లు అరవింద్ ఇప్పుడు నిఖిల్ కి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, "సినిమా చూడగానే నేను నిఖిల్ కి రెండు సినిమాలు ఆఫర్ చేసి ఎంత కావాలి అని అడిగాను కానీ ప్యాకేజ్ ప్రతి సినిమాకి పెరుగుతూ ఉంటుంది అని తను ఒప్పుకోలేదు," అని అన్నారు అల్లు అరవింద్.
అయితే నిఖిల్ ను హీరోగా కాకుండా అల్లు అరవింద్ ఇప్పుడు ప్రొడక్షన్ పార్టనర్ గా మార్చేసుకున్నారు. "తన స్ట్రాటజీ నాకు అర్థమైంది. అందుకే నేను తనని నా ప్రొడక్షన్ పార్టనర్ గా చేశాను. ఇప్పుడు నా సినిమా ప్రొడక్షన్స్ తను కూడా చూసుకుంటాడు. బన్నీ వాసుతో కలిసి ఈ రెండు సినిమాల ప్రొడక్షన్ పనులు నిఖిల్ కూడా చూసుకోబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాల గురించిన ప్రకటన వస్తుంది," అని అన్నారు అల్లు అరవింద్.