Manchu Vishnu: త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమౌతాయి

Manchu Vishnu: తమ కుటుంబంలో విషయాలు.. త్వరలోనే పరిష్కారమౌతాయని మంచు విష్ణు చెప్పారు.

Update: 2024-12-10 06:01 GMT

Manchu Vishnu: త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమౌతాయి

Manchu Vishnu: తమ కుటుంబంలో విషయాలు.. త్వరలోనే పరిష్కారమౌతాయని మంచు విష్ణు చెప్పారు. దుబాయ్ నుంచి మంచు విష్ణు మంగళవారం ఉదయం హైద్రాబాద్ కు వచ్చారు. మంచు మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం నేపథ్యంలో దుబాయ్ లో ఉన్న విష్ణు వెంటనే హైద్రాబాద్ కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చి విష్ణును మోహన్ బాబు ఇంటికి తీసుకెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విష్ణు మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా తమ కుటుంబంలో సాగుతున్న వివాదంపై ఆయన స్పందించారు. ఏ కుటుంబంలోనైనా ఉండే సమస్యలేనని విష్ణు అన్నారు. అన్నీ సర్దుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండు రోజులు మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై మంచు మనోజ్, మోహన్ బాబులు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు కుటుంబంలో వివాదం నేపథ్యంలో ముంబైలో ఉన్న మంచు లక్ష్మి డిసెంబర్ 9న హైద్రాబాద్ కు చేరుకున్నారు. మనోజ్ తో ఆమె మాట్లాడారు.

Tags:    

Similar News