అల వైకుంఠపురములో...సంగీతంలో త్రివిక్రమ్ మాటల సరిగమలు!
అభిమానుల కేరింతల పరవళ్ల లో త్రివిక్రమ్ మాటల ఝరి వేడుకను ఉత్సాహంలో ఓల లాడించింది. త్రివిక్రమ్ మాట్లాడుతున్నంత సేపు, హీరో అల్లు అర్జున్, అభిమానులు, సినిమా యూనిట్ అంతా ఆసక్తిగా విన్నారు.
అల్లు అర్జున్ కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది. అందులో భాగంగానే జనవరి 6 సోమవారం మ్యూజికల్ ఈవెంట్ ని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సహాభరితంగా జరిగింది.
అభిమానుల కేరింతల పరవళ్ల లో త్రివిక్రమ్ మాటల ఝరి వేడుకను ఉత్సాహంలో ఓల లాడించింది. త్రివిక్రమ్ మాట్లాడుతున్నంత సేపు, హీరో అల్లు అర్జున్, అభిమానులు, సినిమా యూనిట్ అంతా ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో డైలాగ్స్ పేలుస్తూ ఉద్వేగభరితంగా మాట్లాడారు.
ఈ సందర్బంగా వేడుకలో మాట్లాడిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. "సంగీతం అంటే మనసు దురద పెడితే గోక్కోవడానికి పనికొచ్చే దువ్వెన అంటూ సరదాగా చెప్పారు". " ఒక్క పదానికే మీరు ఎంతో చెప్పారు.. ఇన్నేళ్లుగా మీరు ఇచ్చిన మాటలకు మేం ఏం ఇవ్వగలం" అని చెప్పారు. ఒక పాట ఊతం ఇచ్చిందంటే ఆపాట స్నేహితుడు, ఒక పాట హితుడు, ఒక పాట గురువు అలాంటి పాటలను గౌరవించాలని తెలిపారు. సంగీతం గురించి ఎంత చెప్పిన తక్కువే అన్నారు. సిరివెన్నెల గురించి గురించి మాట్లాడుతూ.. సిరివెన్నెల కుర్రాడిలా మారిపోయి రాసిన పాటే సామజవరగమన గీతం అన్నారు. అలాగే శ్యామ్, కృష్ణ చైతన్య, శ్రీకృష్ణ కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు.
సంగీతం మన చెవిలో వచ్చి మన చేత కన్నీరు తెప్పించ శక్తి దానికి ఉందని తెలిపారు. తెలుగు సిని సంగీతాన్ని సిరివెన్నెల..వేటూరు వంటి వారు సినిమా కవిత్వాన్ని ఒక కవి రాసే కవిత్వం స్థాయికి తీసుకొచ్చారని, సినిమా పాటలు రాసే సహాసం కవి మాత్రమే చే్స్తారని గొప్ప స్థాయికి తీసుకొచ్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో పాటలు రాసిన ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిస్తున్నాఅని త్రివిక్రమ్ అన్నారు.
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో "నాతో కలిసిన పని చేసిన వారిని నేను ప్రేమిస్తు్న్నాను, ఈ సినిమా తర్వాత అందరూ విడిపోతారు. ఆ బాధను అనుభవిస్తాను మళ్లీ ఓ కథ రాస్తాను". "ఈ సినిమా మొదలు చివర అల్లు అర్జన్ నే ఉన్నారు. "మనం సరదాగా వుందాం అన్న అల్లు అర్జున్ చెప్పిన మాటలు ఇప్పటికి గుర్తుండిపోయాయి. ఈ సినిమా మొదట నుంచి ఇప్పటి వరకూ అర్జున్ చెప్పిన మాటలు మరిచిపోలేము." అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ చిత్రంలో పూజా హేగ్దే కథానాయకగా నటించింది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి గాను సెన్సార్ బోర్డు U /A సర్టిఫికెట్ ని జారీ చేసింది. సంక్రాంతి పండగకి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు.