Ajay Devgn: అజయ్ దేవగన్.. సీక్వెల్ కింగ్!

Ajay Devgn: అజయ్ దేవగన్ సీక్వెల్ చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించనున్నాడు. ‘దేదే ప్యార్ దే 2’, ‘ధమాల్ 4’తో పాటు ‘గోల్‌మాల్ 5’, ‘దృశ్యం 3’ రాబోతున్నాయి.

Update: 2025-10-22 06:00 GMT

Ajay Devgn: అజయ్ దేవగన్.. సీక్వెల్ కింగ్!

Ajay Devgn: అజయ్ దేవగన్ ఇటీవల ‘సైతాన్’ తర్వాత బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘మైదాన్’ ప్రశంసలు పొందినా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.

‘సన్నాఫ్ సర్దార్ 2’ పరాజయం పాలైంది. ఇప్పుడు అజయ్ సీక్వెల్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ‘దేదే ప్యార్ దే 2’ షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 14న రిలీజ్‌కు సిద్ధమైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా కొనసాగుతుండగా, ఈసారి టబు ఈ చిత్రంలో లేదు.


‘ధమాల్ 4’ 2026 లో ఈద్ సందర్భంగా విడుదల కానుంది. ‘గోల్‌మాల్ 5’ అఫీషియల్‌గా ప్రకటించబడగా, డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ‘దృశ్యం 3’ కూడా ఫైనల్ అయింది.


స్ట్రైట్ మూవీస్ కన్నా ఫ్రాంచైజీ చిత్రాలతోనే అజయ్ దూసుకెళ్తున్నాడు. ఈ సీక్వెల్స్ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటాయనేది ఆసక్తికరం. అజయ్ ఈ చిత్రాలతో హిట్ ట్రాక్‌లోకి వస్తాడా అనేది సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News