RRRలో అదే నాకు అసంతృప్తి : శ్రియ

Shriya Saran Opens Up Her Role In RRR : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న

Update: 2020-09-12 12:22 GMT

Shriya Saran, NTR, Ram charan

Shriya Saran Opens Up Her Role In RRR : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా తన పాత్ర గురించి శ్రియ తాజాగా స్పందించింది. ఇందులో తనది చాలా చిన్న పాత్రేనని చెప్పుకొచ్చింది శ్రియ.. ఇక చత్రపతి సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో మరోసారి నటించడం చాలా అనందంగా ఉందని వెల్లడించింది. ఇందులో అజయ్ దేవ్‌గణ్‌ తో కలిసి నటిస్తున్నట్టుగా వెల్లడించింది. అజయ్ చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది శ్రియ.. అయితే దురదృష్టవశాత్తూ ఈ సినిమాలో ఎన్టీఆర్ చరణ్‌తో నాకు సీన్లు ఉండవని అదే నాకు అసంతృప్తి అంటూ వెల్లడించింది.. అయితే సినిమాలో వారి పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయాని చెప్పుకొచ్చింది.

ఇప్పటిదాకా రాజమౌళి తన సినిమాలలోని హీరోయిన్స్ పరంగా అనుష్కను తప్ప వేరెవ్వరిని రిపీట్ చేయలేదు.. ఇప్పుడు రాజమౌళి తన సినిమాలో శ్రియను రిపీట్ చేస్తుండటం విశేషం. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. 

Tags:    

Similar News