Actress: ఇబ్బందిగా ఉంది ఫొటోలు తీయకండి అన్నా వినట్లేదు.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌..

Actress: ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వేడుకలల్లో మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీయడం సర్వసాధారణమైన విషయం.

Update: 2025-03-07 10:00 GMT

Actress: ఇబ్బందిగా ఉంది ఫొటోలు తీయకండి అన్నా వినట్లేదు.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌..

Actress: ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వేడుకలల్లో మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీయడం సర్వసాధారణమైన విషయం. అయితే దీనివల్ల ఇబ్బందిగా ఉంటోందని, అలా తీయకమని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది అందాల తార. ఇంతకీ ఎవరా హీరోయిన్‌.? ఆమె ఆ వ్యాఖ్యలు చేయడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

'క' మూవీతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ హీరో నటించిన దిల్‌ రూబా విడుదలకు సిద్ధమవుతోంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మార్చి 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికీ విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌.. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ రుక్సర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రుక్సర్ మాట్లాడుతూ.."స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీయొద్దని గౌరవంగా చెప్పినా, కొంతమంది మీడియా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. మనం సాధారణంగా ఫోటోలు తీసుకుంటాం, కానీ ఎవరికైనా అసౌకర్యంగా ఉంటే అలా చేయడం తగదు. అన్‌కంఫర్ట్ ఫీలైనపుడు మరెవరైనా ఫోటోలు తీస్తే ఊరుకుంటారా? గౌరవంగా చెప్పినా ఇప్పటికీ పరిస్థితి మారడం లేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

రుక్సర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో రుక్సర్‌ ఒకింత అసహనానికి గురయ్యారు. దిల్ రూబా సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో రుక్సర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

Tags:    

Similar News