Actress Rambha: నటి రంభ రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన తమిళ నిర్మాత
నటి రంభ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. 15 ఏళ్ల వయస్సులోనే ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు.ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
నటి రంభ రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన తమిళ నిర్మాత
Actress Rambha: నటి రంభ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. 15 ఏళ్ల వయస్సులోనే ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ విషయంపై తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో నిర్మాత ఎస్.థాను.. రంభ రీ ఎంట్రీ గురించి మాట్లాడారు. రంభ ఆర్థికంగా సెటిల్ అయ్యారు. ఆమె భర్త కూడా ఒక ప్రముఖ వ్యాపారి. అతను ఇటీవల తనను కలిసినప్పుడు రంభకు ఒక మంచి సినిమాలో అవకాశం కల్పించమని కోరారని అన్నారు. అటువంటి అవకాశం దొరికితే ఆమెను తప్పక సంప్రదిస్తానని రంభ భర్తకు హామీ ఇచ్చానని చెప్పారు. దీంతో రంభ మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెడుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు రీ ఎంట్రీపై రంభ మాట్లాడుతూ సినీ రంగంలోకి పునరాగమనానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నా.. నా వయస్సుకు తగినట్టు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మంచి పాత్రల ద్వారా తిరిగి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవాలనుకుంటున్నా అని చెప్పారు.
రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో రంభ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జు, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకున్నారు. దేశముదురు, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టారు. ఆ తర్వాత 2010లో ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. ఇన్నాళ్లు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తూ సినిమాలకు దూరంగా ఉన్నారు. నటనకు దూరంగా ఉన్నప్పటికీ పలు టీవీ డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. చివరిసారిగా 2008లో వెండితెరపై కనిపించారు రంభ.