Nithya Menen: నిత్యా మీనన్ ఇంట విషాదం.. శకం ముగిసిందంటూ ఎమోషనల్ పోస్ట్..

Nithya Menen: హీరోయిన్‌ నిత్యా మీనన్ ఇంట విషాదం నెలకొంది.

Update: 2023-07-16 06:19 GMT

Nithya Menen: నిత్యా మీనన్ ఇంట విషాదం.. శకం ముగిసిందంటూ ఎమోషనల్ పోస్ట్..

Nithya Menen: హీరోయిన్‌ నిత్యా మీనన్ ఇంట విషాదం నెలకొంది. నిత్యా అమ్మమ్మ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో నిత్య ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. ఈ మేరకు అమ్మమ్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్.. ఇప్పటినుంచి మరో కోణంలో చూసుకుంటా అంటూ బాధ పడుతూ పోస్ట్ పెట్టింది నిత్యామీనన్. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

ఇక ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన ఈ హీరోయిన్‌.. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. గతేడాది పవన్‌ కల్యాణ్‌ సరసన ‘భీమ్లానాయక్‌’లో కనిపించి అలరించింది. ప్రస్తుతం మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే వెబ్‌ సిరీస్‌లతోనూ సిద్ధమవుతోంది.


Tags:    

Similar News