Abhinaya: ఇంట్రెస్టింగ్‌ ఫొటో షేర్‌ చేసిన అభినయ.. 'మా ప్రయాణం నేటితో మొదలైంది' అంటూ..

Abhinaya: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార అభినయ.

Update: 2025-03-10 04:44 GMT

Abhinaya: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార అభినయ. ఈ సినిమాలో వెంకటేష్‌, మహేష్‌లకు చెల్లెలిగా నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే అభినయ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అభినయ పెళ్లిక సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసేసిందీ బ్యూటీ. సోషల్ మీడియా ద్వారా నిశ్చితార్థ వార్తను అభిమానులతో పంచుకుంది. ఎంగేజ్మెంట్ సందర్భంగా గుడిలో కాబోయే జీవిత భాగస్వామితో కలిసి గంట కొడుతున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. “మా ప్రయాణం నేటితో ప్రారంభమైంది” అనే క్యాప్షన్‌ తో తన నిశ్చితార్థాన్ని వెల్లడించింది. దీంతో అభినయకు కాబోయే భర్త ఎవరనో చర్చ నడుస్తోంది.

అయితే తన కాబోయే భర్త వివరాలు వెల్లడించకుండా, అతడి ముఖాన్ని ఫోటోలో చూపించకుండా ట్విస్ట్‌ ఇచ్చింది అభినయ. అయితే అతడితో తమకున్న అనుబంధం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమిస్తున్నట్లు తెలిపింది. గత పదిహేను సంవత్సరాలుగా తమ మధ్య మంచి బంధం ఉందని, అతడు తనను బాగా అర్థం చేసుకుంటాడని చెప్పింది. ఏ విషయమైనా అతడితో చెప్పుకోగలిగే సౌలభ్యం ఉందని, పెళ్లికి ఇది సరైన సమయం అనిపించిందని పేర్కొంది. మరి పెళ్లి రోజైనా భర్తను పరిచయం చేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే.. ఒకప్పుడు నటుడు విశాల్‌తో అభినయ ప్రేమలో ఉందంటూ కొన్ని వార్తలు వినిపించినా.. అవన్నీ రూమర్స్‌ మాత్రమేనని, తాము కేవలం సహనటులమేనని అభినయ స్పష్టం చేసింది. ఇప్పుడు నిశ్చితార్థంతో ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Tags:    

Similar News