Naseeruddin Shah: ఆసుపత్రిలో చేరిన నసీరుద్దీన్ షా
Naseeruddin Shah: నసీరుద్దీన్ షా(70) న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు
Actor Naseeruddin Shah
Naseeruddin Shah: సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం సృష్టించింది. మరి కొంత మంది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలు అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా.. ఇప్పుడు మరో యాక్టర్ నసీరుద్ధీన్ షా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. 70 ఏళ్ల నసీరుద్దీన్ షా న్యూమోనియాతో బాధపడుతున్నారు. మంగళవారం ఆయనకు ఆరోగ్యం మరింత క్లీణించడంతో ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం నసీరుద్దీన్ ఆరోగ్యం బాగుందని.. చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన మేనేజర్ తెలిపారు. గత రెండు రోజులుగా నసీరుద్దీన్ న్యూమోనియాతో బాధుపడుతున్నారని ఆయన భార్య రత్న పాథక్ అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా చెప్పారు.
నసీరుద్దీన్ 1975లో శ్యామ్ బెనెగన్ తెరకెక్కించిన నిశాంత్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్పార్ష్, కల్ట్, జానే భీ దో యారో, మసూమ్, మిర్చి మసాలా, ఇష్కియా, డర్టీ పిక్చర్, జిందగీ నా మిలేగి డోబారా వంటి చిత్రాల్లో నటించారు. దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించిన నసీరుద్దీన్ మూడు జాతీయ అవార్డులను అందుకున్నాడు.