నాటి శివ, నేటి మన్మధుడి పుట్టినరోజు ఈ రోజు.

Update: 2019-08-29 04:47 GMT

భక్తిలో....అన్నమయ్య ఆయనే... నట శోధనలో శివ ఆయనే... అందంలో నిత్య మన్మధుడు ఆయనే...ఇప్పటికే మీరు గుర్తు పట్టి వుంటారు...ఆయన ఎవరో కాదు.....మన అక్కినేని నాగార్జున. ఈ రోజు గ్రీకువీరుడు..నాగార్జున పుట్టినరోజు. నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. అయితే...మొదట్లో నాగార్జున...తన తండ్రి బాటలోనే సినిమాల్లో వచ్చినా....ఈ రోజు.. నేటి సినిమాల్లో... నాగార్జున తన మొదటి కుమారుడు నాగ చైతన్య, రెండవ కుమారుడు అఖిల్ తో పోటిలో నిలుస్తున్నాడు. అయితే నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు.

విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. మరియు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన మన్మధుడికి తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగేలేదు. ఇంకా ఎన్నో మంచి చిత్రాలు నాగార్జున చెయ్యాలని ఆశిస్తూ...మరొకసారి..పుట్టిన రోజు శుభాకాంక్షలు.  

Tags:    

Similar News