Darshan : స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు దూరంగా దర్శన్.. జైలులో మౌనంగా కూర్చున్న స్టార్ హీరో
Darshan : స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు దూరంగా దర్శన్.. జైలులో మౌనంగా కూర్చున్న స్టార్ హీరో
Darshan : స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు దూరంగా దర్శన్.. జైలులో మౌనంగా కూర్చున్న స్టార్ హీరో
Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలుకు తిరిగి వెళ్లడంతో ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇంతకాలం బెయిల్ మీద బయట ఉన్న ఆయన, ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అనారోగ్యం కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన ఆయన ఆ తర్వాత పూర్తి బెయిల్ కూడా పొందారు. అయితే, ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించడంతో సుప్రీంకోర్టు ఆయన బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో దర్శన్ ఇప్పుడు జైలులో ఉన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా హాజరు కాకుండా ఒంటరిగా కూర్చున్నారు.
దర్శన్ బెయిల్ రద్దు కావడానికి కారణం ఆయన చేసిన కొన్ని తప్పులేనని కోర్టు పేర్కొంది. బెయిల్ మీద బయట ఉన్నప్పుడు ఆయన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేసులో సాక్షి అయిన చిక్కణ్ణ అనే వ్యక్తితో కలిసి తిరగడం, సినిమాల ప్రమోషన్లలో పాల్గొనడం వంటివి చేశారు. వెన్ను నొప్పి కారణంగా విచారణకు హాజరు కాలేనని చెప్పిన ఆయన, మరుసటి రోజే ఒక సినిమా ప్రదర్శనలో పాల్గొనడం కోర్టు దృష్టికి వచ్చింది. ఇవన్నీ కోర్టు కఠినంగా పరిగణించి, ఆయన బెయిల్‌ను రద్దు చేసింది.
ప్రస్తుతం దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఆగస్టు 15న జైలులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో పాల్గొనడానికి జైలు అధికారులు ఆయనను ఆహ్వానించారు. కానీ, ఆయన ఆ వేడుకలకు హాజరు కావడానికి నిరాకరించారు. నేను రాను అని మాత్రమే చెప్పి మళ్లీ మౌనంగా ఉండిపోయారు. జైలులో ఆయన చాలా నిరాశగా, ఒంటరిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
దర్శన్‌కు జైలులో 7314 ఖైదీ నంబర్ కేటాయించారు. ఈ కేసులో సహ నిందితురాలు పవిత్రా గౌడ ఖైదీ నంబర్ 7313. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసినందున, ఆయన మళ్లీ బెయిల్ కోసం ప్రయత్నించడం అంత సులభం కాదు. ఆయన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనంలో లేదా దిగువ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈసారి వెన్ను నొప్పి వంటి ఆరోగ్య కారణాలు చెప్పినా బెయిల్ దొరికే అవకాశం తక్కువని న్యాయ నిపుణులు చెబుతున్నారు.