Big Breaking: నటుడు, సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి

Big Breaking: కత్తి మహేష్ మృతిని ధృవీకరించిన వైద్యులు ఊపిరితిత్తుల సమస్యతో మధ్యాహ్నం కన్నుమూత

Update: 2021-07-10 12:31 GMT

కత్తి మహేష్ (ఫైల్ ఇమేజ్)

Big Breaking: సినీ నటుడు, సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి చెందారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కత్తి మహేష్ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఊపిరితిత్తుల సమస్యతో ఈ మధ్యాహ్నం కన్నుమూసినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గతనెలలో నెల్లూరులో మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ముఖానికి, కళ్లకు తీవ్ర గాయాలు కావడంతో.. మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.. దాంతో అక్కడ చికిత్స పొందుతూ కత్తి మహేష్ ఇవాళ మృతి చెందారు..

జూన్ 26న నెల్లూరు సమీపంలోని కత్తి మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహేష్ తలకు బలమైన గాయాలు కావడంతో.. మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకు తరలించారు. వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందించారు. కత్తి మహేష్ వైద్యానికి ఏపీ ప్రభుత్వం 17 లక్షల ఆర్థిక సాయం అందించింది. చికిత్స పొందుతూ ఈ మధ్యహ్నం మృతి చెందారు. కత్తి మహేష్ వివాదస్పద వ్యాఖ్యలతో ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ వన్‌లో కంటెస్టంట్ గా పాల్గొని.. హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ మెప్పు పొందారు..

కత్తి మహేష్ నటుడిగా హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, నేనే రాజు నేనే మంత్రి, క్రాక్ చిత్రాల్లో నటించారు. పెసరట్టు సినిమాకు దర్శకత్వం వహించారు.. తనదైన శైలీలో యాసలో ప్రేక్షకులను కట్టి పడేశారు. సినిమాలే కాకుండా.. రాజకీయాల పైన మంచి పట్టున్న ఆయన.. వర్తమాన రాజకీయాలపై విమర్శలు కూడా చేసేవారు.. అలాంటి గళం ఇప్పుడు మూగపోయింది.  

Full View


Tags:    

Similar News