ప్యాన్ వరల్డ్ సినిమా తీయబోతున్న ప్రభాస్

Prabhas: ప్యాన్ వరల్డ్ సినిమాగా "ఆది పురుష్".

Update: 2022-02-04 04:04 GMT

ప్యాన్ వరల్డ్ సినిమా తీయబోతున్న ప్రభాస్

Prabhas: ప్రభాస్ కెరియర్ ను బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని రెండు గా చెప్పుకోవచ్చు. బాహుబలి కి ముందు కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రభాస్ క్రేజ్ ఉండేది. కానీ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గ ఈ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైన్లో పెడుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా కూడా అదే రేంజ్ లో ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆదిపురుష్".

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ సినిమాగా మార్చాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాక విదేశీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాని 15 దేశీయ మరియు విదేశీ భాషల్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని 20,000 థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రతి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరుగుతూనే వస్తోంది.

Tags:    

Similar News