త్రీ మంకీస్ ‌: షకలక శంకర్‌ను ఇమిటేట్‌ చేసిన గెటప్ శ్రీను

జబర్దస్త్ కమెడియన్స్ ప్రముఖ కామెడీ ప్రోగ్రామ్‌లో అలరించిన రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'త్రీ మంకీస్'.

Update: 2020-02-03 13:48 GMT

జబర్దస్త్ కమెడియన్స్ ప్రముఖ కామెడీ ప్రోగ్రామ్‌లో అలరించిన రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'త్రీ మంకీస్'. ఈ మూవీని జి. నగేష్‌ నిర్మించారు. కారుణ్య చౌదరి హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం మాధాపూర్ లో జరగనుంది.

కాగా.. రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ‎HMTVతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గెటప్ శ్రీను మాట్లాడుతూ.. షకలక శంకర్ ‌ హీరోగా కొన్ని సినిమాల్లో నటించారని తాము అడిగిన వెంటనే సినిమాలో చేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. సినిమా రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని, కామెడీ, సస్పెన్స్ థ్రిలర్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని గెటప్ శ్రీను అన్నారు. జబర్దస్త్‌ ను మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుందని, తప్పకుండా సక్సెస్‌ అవుతుంది అనుకుంటున్నానని రాం ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ముగ్గురం కలసి చేశాం, కామెడీ, సెంటిమెంట్‌, ఎమోషన్‌ అంశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తన్నట్లు సుడిగాలి సుధీర్ తెలిపారు.


Full View


Tags:    

Similar News