Check Movie Review: చెక్ రివ్యూ

Update: 2021-02-26 09:52 GMT

Check Movie Review: చెక్ రివ్యూ

Check Movie Review: నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో రూపోందిన యాక్షన్ థ్రిల్లర్ చెక్. నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలకపాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత ఆనంద్ వి ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించా లేదో ఈ రివ్యూ లో చూడండి.

టాలీవుడ్ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తోంది. లాక్ డౌన్ ఆనంతరం రిలీజైన ప్రతి సినిమా సక్సెస్ సాదిస్తుండటంతో చిన్న హీరో నుంచి స్టార్ హీరోలు తమ అద్రుష్టాన్ని పరీక్షించుకునేందుకు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. అందులో భాగంగానే హీరో నితిన్ ఇప్పటివరకు చెయ్యని థ్రిల్లర్ జానర్ చెక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

బీష్మ్ సక్సెస్ తర్వాత నితిన్ నటించిన మూవీ ఇదే.. ఇక చెక్ కథ విషయానికోస్తే నితిన్ అతి తెలివైన యువకుడు.. తన తెలివి తేటలను ఉపయోగించే ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుంటాడు. పేర్లు మార్చకుంటూ మోసాలకు పాల్పడే నితిన్ , ప్రియా ప్రకాష్ వారియతో తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. అతను చేసిన ఆన్ లైన్ల్ మోసాల వల్ల ,అతని సంబంధం లేకుండానే 40 మంది చావుకు కారణమయ్యాడని ..అతనికి ఉరిశిక్ష విదిస్తారు. ఎవరు లేని నితిన్ ఉరిశిక్షను తప్పించుకోవాలని చేసిన ప్రయత్నం ఏంటి.. ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్ ఏమైంది.. జైల్లో ఉండి చెక్ ప్లేయర్ గా ఎలా పేరుతెచ్చుకున్నాడు. అసలు కేసు నుంచి బయటపడ్డాడ లేదా అనేదే సినిమా కథ.

నితిన్ ఎప్పటిలాగే మంచి నటనను కనబర్చాడు చెక్ ప్లేయర్ గా ఎత్తుకు పై ఎత్తులు వేసే ఆటగాడిగా జైల్లో ఓ ఖైదీ మానసిక స్థితి ఎలా ఉంటుందో తన నటనతో చూపించి అందరిని ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ అందం ,అభినయంతో నితిన్ కి మంచి జోడిగా అలరించింది. రకల్ ఫ్రీత్ సింగ్ కి గ్లామర్ డాల్ గానే పేరుంది కానీ ఈ సినిమాతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్టే అని చెప్పోచ్చు. ఓ లాయర్ పాత్రలో మంచి నటనను కనబరిచింది. ఇక నటుడు సాయిచంద్ , పోసాని , సంపత్ రాజ్ , మురళీ శర్మ తమ పాత్ర పరిధిలో మంచి నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సినిమా చూస్తున్న ప్రేక్షకులు ట్విట్టర్ (Check Movie Twitter Review) లో తమ అభిప్రాయాలను కూడా వెలిబుచ్చారు.

భీష్మ్ సక్సెస్ తర్వాత రిలీజైన చెక్ సినిమా నితిన్ పెట్టుకున్న ఎన్నో ఆశలకు చెక్ పెట్టింది. చంద్రశేఖర్ యేలేటి , నితిన్ కు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అనే సరికి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అంచనాలు పటాపంచలు చేస్తూ చెక్ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. దర్శకుడిగా గతంలో మంచి పేరున్న చంద్రశేఖర్ యేలేటి నుంచి ఈ కథ వస్తోందని ప్రేక్షకులు ఉహించలేకపోయారు. అసలు ఏం చెప్పాలనుకున్నారో తెలియకుండా ఈ సినిమా తీసినట్లు అనిపిస్తోంది. నితిన్ కూడా ఈ సినిమా ఏలా ఒప్పుకున్నాడో అర్ధంకాని పరిస్థితి. ఈ సినిమా లో కాస్తో కూస్తూ చెప్పుకోవాంటే కళ్యాణ్ మాలిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , డైలాగ్స్ , రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫి మాత్రమే బాగున్నాయి. అనల్ ఎడిటింగ్ పై ద్రుష్టి పెట్టాల్సిందే. ఇటువంటి సినిమాలకు స్ర్రీన్ ప్లే నే ప్రాణం కానీ దాని పై డైరెక్టర్ ధ్రుష్టి పెట్టాల్సిందే. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 1.5 /5 ఇవ్వోచ్చు.

Tags:    

Similar News