
నితిన్ (ఫోటో ట్విట్టర్ )
Nithin Check: యంగ్ హీరో నితిన్, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం తాజా చిత్రం 'చెక్'.
Nithiin Check: యువ హీరో నితిన్, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం తాజా చిత్రం చెక్. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (ఫిబ్రవరి 26న) విడుదలకానుంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు.
చదరంగం( Chess) నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ఇప్పటికే టీం చెప్పేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశారు చెక్ టీం. ప్రియా ప్రకాష్ వారియర్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. గత కొంత కాలంగా కమర్షియల్ హిట్ కోసం దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎదురు చూస్తున్నాడు. చెక్ సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ అందించాడు. అయితే సినిమాలో కథ డిమాండ్ మేరకు పాటలకు అంతగా ప్రయారిటీ ఇ్వవలేదని..కేవలం ఒక్క పాటను మాత్రమే పెట్టాల్సి వచ్చిందని.. తేల్చి చెప్పారు దర్శక నిర్మాతలు. ఇలా యంగ్ హీరో నితిన్ సినిమాలో సింగిల్ సాంగ్ ఉండడం మొదటిసారి. ఇది నితిన్ కు ఓ ఎక్స్‌పరిమెంట్ లాంటిదే.. మరి ఈ ప్రయోతం ఎంత వరకు పలిస్తుందో చూడాలి.
ట్విట్టర్ లో చెక్ మూవీ రివ్యూ (Check Movie Review): హిట్ ఖాయమంటున్న ప్రేక్షకులు
ట్విట్టర్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటు సినిమా ఎలా ఉందనేది చెప్పేస్తున్నారు. వాళ్ల అభిప్రాయం మేరకు.. చెక్ సినిమా ఫస్టాఫ్ లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేషాలతో బాగా తీర్చి దిద్దారంట. అలాగే అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్లు కూడా అడ్డుపడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రధాన సమస్య ఏంటంటే.. ఈ సినిమా కథను భావోద్వేగంతోనే కనెక్ట్ చేయడం కొతం ఇబ్బందిగా ఉందంటున్నారు ప్రేక్షకులు. అలాగే సినిమి ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ అంటున్నారు. స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని, కళ్యాణీ మాలిక్ మ్యూజిక్ తో బాగా హెల్ప చేశాడంటున్నారు.
ఓవరాల్ గా ఫస్టాఫ్ చాలా డీసెంట్‌గా సాగిందని అంటున్నారు. ఇంటర్వేల్ బ్యాంగ్ సెకాండ్ పై అంచనాలు పెంచేలా చేశాయన్నారు. అలాగే క్లైమాక్స్ చెక్ మూవీకి హైలైట్ గా ఉంటుందని ఫ్యాన్స్ ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నారు. మొత్తంగా సినిమా అక్కడక్కడ కొన్ని మైనస్ లు ఉన్నా.. ట్విట్టర్‌లో నెటిజన్స్ కామెంట్స్ బట్టిచూస్తే నితిన్‌కు మరో హిట్ గ్యారెంటీ అని తెలుస్తోంది. ఎక్కువ శాతం ప్రేక్షకులు సినిమా గురించి పాజిటివ్ టాక్ ఇస్తున్నారు.
#Check
— Nenu Devudni (@urshater) February 26, 2021
2nd Half Twists Main 👌
Sequel Planning Anukunta 🤔
My Rating 3.25/5 👍 https://t.co/DcYzXZj4mM
#Check
— Nenu Devudni (@urshater) February 26, 2021
2nd Half Twists Main 👌
Sequel Planning Anukunta 🤔
My Rating 3.25/5 👍 https://t.co/DcYzXZj4mM
Hittu kottesadu anta#Check
— Nandhu fan of KGF 💥💥💥 (@nandhunandamuri) February 26, 2021

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire