తమన్ పూర్తి పేరు ఏంటో మీకు తెలుసా!

Update: 2019-02-01 09:47 GMT
తమన్ పూర్తి పేరు ఏంటో మీకు తెలుసా!
  • whatsapp icon

సూపర్ హిట్ సినిమాల సంగీత దర్శకుడిగా,తమన్ గా పేరు తెచ్చుకున్న తమన్ పూర్తి పేరు ఏంటో మీకు తెలుసా! తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్, అయితే తమన్ గా బాగా గుర్తింపు. ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాలలో పనిచేసే భారతీయ సినీ సంగీత దర్శకుడు తమన్. సంగీత దర్శకుడిగా ఈయన తొలిచిత్రం రవి తేజ నటించిన బ్లాక్ బస్టర్ తెలుగు సినిమా కిక్, అలాగే ఇతను బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్ గా ఒక పాత్రలో నటించాడు. ఇతను దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక సంగీత దర్శకునిగా నిలదొక్కుకున్నాడు. ఇతను అక్కినేని నాగేశ్వరరావు పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన "సీతారామ జననం" సినిమాను తెరకెక్కించిన గతకాలపు దర్శకుడు మరియు నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. తమన్ పొట్టేపాళెం, నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు. ఇతని తండ్రి ఘంటసాల శివ కుమార్, అతను స్వరకర్త కె.చక్రవర్తి కింద ఏడువందల సినిమాల్లో పనిచేసిన ఒక డ్రమ్మర్, తన తల్లి ఘంటసాల సావిత్రి నేపథ్య గాయని మరియు తన అత్త పి.వసంత కూడా గాయనీమణి. తమన్ నేపథ్య గాయని శ్రీవర్ధినిని వివాహం చేసుకున్నాడు. శ్రీ.కో. 

Similar News