సరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!

Update: 2019-02-18 09:52 GMT

ఈ మద్య వచ్చిన మరో మంచి పాట, సైనికుని గొప్పతనాన్ని వర్ణించే పాట, రామజోగయ్య మదిలో మొలచి...తన కలం నుండి ప్రవహించిన పాట.. నా పేరు సూర్య..లోని "సైనిక" పాట...

సరిహద్దున నువ్వు లేకుంటే

ఏ కనుపాప కంటి నిండుగ

నిద్రపోదురా నిద్రపోదురా

నిలువెత్తు నిప్పు కంచెవై

నువ్వుంటేనే జాతి బావుట

ఎగురుతుందిరా పైకెగుతుందిరా

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా

నీ తల్లే ఇండియా

తన భరోసా నువ్వే దేశం కొడకా

సెలవే లేని సేవక ఓ సైనికా

పనిలో పరుగే తీరిక ఓ సైనికా

ప్రాణం అంతా తేలిక ఓ సైనికా

పోరాటం నీకో వేడుక ఓ సైనికా

దేహంతో వెళ్లిపోదీ కథ

దేశంలా మిగిలిపోతుందిగా

సమరం ఒడిలో నీ మరణం

సమయం తేల్చే స్మరణం

చరితగా చదివే తరములకు

నువ్వో స్ఫూర్తి సంతకం

పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా

పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనికా

గస్తీ దుష్టుల సాక్షిగా ఓ సైనికా

ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనికా

బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు

ఏ పని తెలియదని నీ అడుగిటు పడలేదు

తెగవగు ధీరుడివనీ బలమగు బతుకీడనీ

నీ శక్తిని నమ్మి

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా

నీ తల్లే ఇండియా

తన భరోసా నువ్వే దేశం కొడకా

నువ్వో మండే భాస్వరం ఓ సైనికా

జ్వాల గీతం నీ స్వరం ఓ సైనికా

బతుకే వందేమాతరం ఓ సైనికా

నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనికా

ఇలాంటి పాటలు మన సైనికులు ఎంత గోప్పవారో, వారి త్యాగం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. శ్రీ.కో. 

Similar News