జంధ్యాల దర్శకుడిగా మొదటి సినిమా.

ముద్ద మందారం జంధ్యాల దర్శకునిగా, ప్రదీప్, పూర్ణిమ ప్రధాన పాత్రల్లో 1981లో విడుదలైన ప్రేమకథాచిత్రం. రచయిత జంధ్యాల ఈ చిత్రంతో దర్శకులుగా మారారు.

Update: 2019-01-08 11:58 GMT

ముద్ద మందారం జంధ్యాల దర్శకునిగా, ప్రదీప్, పూర్ణిమ ప్రధాన పాత్రల్లో 1981లో విడుదలైన ప్రేమకథాచిత్రం. రచయిత జంధ్యాల ఈ చిత్రంతో దర్శకులుగా మారారు. ప్రదీప్ మరియు పూర్ణిమలు తొలిసారిగా చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతో పరిచయమయ్యారు. చక్కటి సంగీతం, సంభాషణలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన తప్పెటగుళ్ళ నృత్యం చిత్రంలో చూపబడింది. సినిమా మంచి విజయాన్ని సాధించింది. విజయవంతుడైన సినీ రచయితగా తెలుగు పరిశ్రమలో పనిచేస్తున్న జంధ్యాల అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కొన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రాలను చూసి వాటి వాస్తవికతకు ముచ్చటపడ్డారు. అలాంటి వాస్తవికమైన సినిమా తీయాలన్న ఆలోచనతో దర్శకుడయ్యారు. ఆ క్రమంలోనే ఈ సినిమాకు ప్రారంభమైంది. టీనేజ్ ప్రేమకథతో నిర్మించబోయే చిత్రానికి "ముద్దమందారం", "సన్నజాజి" అనే పేర్లలోంచి ముద్దమందారమనే పేరును ఎంచుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా మీరు చూడకుంటే మాత్రం తప్పక ఒక సారి చూడవచ్చు.శ్రీ.కో.

Similar News