Live Updates:ఈరోజు (జూన్-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-30 01:26 GMT
Live Updates - Page 2
2020-06-30 05:38 GMT

- కడప జిల్లా .


- నిత్యావసర వస్తువులు మొదలుకొని గ్యాస్ పెట్రోల్ వరకు అధిక ధరలతొ పేదవాడిపై భారం మోపు తున్నారంటూ...

- బద్వేల్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెడలో కూరగాలు వేసుకుని అర్ధనగ్నంగా వినూత్న రీతిలో నిరసన తెలిపిన సిపిఐ...

2020-06-30 03:04 GMT

అమరావతి: ప్రభుత్వోద్యోగులకు జులై నెల వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ల చెల్లింపు రెండు మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశముంది.

జులై 3కి వేతనాలు అందవచ్చునని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ద్రవ్య వినిమయ బిల్లు.. శాసనమండలి ఆమోదం పొందక పోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

2020-06-30 02:48 GMT

ఆంధ్ర ప్రదేశ్...

- కేంద్ర ప్రభుత్వం వరుసగా రోజూ పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ నేడు 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు.

- విజయవాడలో పాల్గొననున్న సిపిఐ-సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి మధు, ఇతర వామపక్ష నేతలు.

2020-06-30 02:43 GMT

ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగించానున్న ప్రధాని

నేటి సాయంత్రం జాతి నుద్దేశించి ప్రసంగించనున్న మోడీ దేనిపై మాట్లాడాతారనే దానిపై ఇంకా స్పష్టత కనిపించడం లేదు. ఒక పక్క చైనా చర్యలు గురించి చర్చ జరుగుతుండగా, మరో పక్క దేశంలో కరోనా కేసులు మరింత తీవ్రరూపం దాల్చడంతో దీనిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై చర్చించుకుంటున్నారు. ఏ విషయమై ఆయన మాట్లాడినా ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించడం తప్పనిసరని పీఎంవో కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. భారత్-చైనా మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆయన ప్రసంగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం భారత్-చైనా దేశాల కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో మోదీ ప్రసంగిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దానికి తోడు ఇవాళ 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోగా మంగళవారం ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

2020-06-30 02:35 GMT

హైదరాబాద్ లో దారుణం : తోబుట్టువులను చంపిన ఉన్మాది

- హైదరాబాద్‌ పాతబస్తీలో సోమవారం రాత్రితోడబుట్టిన ముగ్గురు అక్కలపై ఓ ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు.

- దాంతో ఇద్దరు తొబుట్టువులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

- మూడో అక్కను చంపేటప్పుడు అడ్డుగా వచ్చిన బావనూ పొడిచేశాడు. నాలుగో అక్కనూ చంపుదామనుకున్నాడు.

- పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఠాణా పరిధి బార్కస్‌ సలాలాలో అహ్మద్‌ ఇస్మాయిల్‌(27) అనే మాజీ బౌన్సర్‌ సోమవారం ఇంటికి వచ్చిన ఇద్దరక్కలు రజియాబేగం, జకిరాబేగంలపై కత్తితో దాడిచేశాడు.

- అనంతరం అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలోని నబీల్‌కాలనీలో ఉంటున్న మూడో సోదరి నూరాబేగం ఇంటికి వెళ్లి ఆమెపై, బావ ఉమర్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు.

- సమాచారం తెలుసుకున్న అదనపు సీపీ(ట్రాఫిక్‌)అనిల్‌కుమార్‌ అక్కడికి చేరుకున్నారు. రజియాబేగం అప్పటికే చనిపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జకిరాబేగం, నూరాబేగం, ఉమర్‌లను ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. జకిరాబేగం చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.


2020-06-30 02:01 GMT

- విశాఖలో మరోసారి గ్యాస్ కలకలం రేపింది.

- గతంలో పాలిమర్స్ లో గ్యాస్ లీకవగా, ఈ దఫా ఫార్మా కంపెనీలో ఘటన చోటుచేసుకుంది.

- సైనారా కెమికల్స్ లో రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

- ఈ ఘటనలో వాయువు పీల్చిన వారిని గాజువాక ఆస్పత్రిలో చికిత్స తరలించారు.

- వీరిలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు చికిత్స పొందుతున్నారు.  

Tags:    

Similar News