Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-17 00:31 GMT

ఈరోజు బుధవారం, 17జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఏకాదశి ( ఉ.07:45 వరకు), అశ్వనీ నక్షత్రం (ఉ.06:04 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-06-17 16:38 GMT

» కుక్కల దాడిలో జింక మృతి.


- కృష్ణాజిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామం లో పొలాలోకి దారితప్పి వచ్చిన జింక..

- జింక పై దాడి చేసిన వీధి కుక్కలు..

- కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన జింక..

2020-06-17 16:35 GMT

»» మళ్ళీ ఎలాంటి లాక్ డౌన్ లు ఉండవు..

◆ దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు..

♦ దేశంలో లాక్ డౌన్ ల దశ ముగిసి, అన్ లాక్ ల దశ ప్రారంభమయిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు..

◆ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

2020-06-17 16:02 GMT

» తెలంగాణ లో రికార్డ్ స్థాయిలో 269 కరోన పాజిటివ్ కేసులు నమోదు..

- ఇప్పటి వరకు 5675 కి చేరిన కేసుల సంఖ్య ..

- ఇవాళ మరో ఒక్కరు మృతి 192 కి చేరిన మరణాల సంఖ్య...

- 2412 అక్టీవ్ కేసులు...

- 3071 ఇప్పటి వరకు డిచార్జి అయిన వారు..

- జిహెచ్ఎంసి లో రికార్డ్ స్థాయి లో 214 కేసులు నమోదు

2020-06-17 15:33 GMT

»» సూర్యాపేట 

- హాకీంపేట నుంచి బయలుదేరిన కల్నల్ సంతోష్ బాబు పార్ధివదేహం.

- పార్ధివదేహం ను తీసుకొస్తున్న అంబులెన్స్ తోనే మంత్రి జగదీష్ రెడ్డి రాక.

-  రాత్రి పదిన్నర కల్లా సూర్యాపేట కు చేరిక.

- రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు ప్రజల సందర్శనార్ధం విద్యానగర్ లో సంతోష్ బాబు పార్ధివదేహం.

-  ఆతర్వాత అంతిమ యాత్ర ప్రారంభం.

- ఆర్మీ అధికారుల సూచనతో కోవిడ్ 19 న ప్రకారం అంతిమయాత్ర.

- కేసారం దగ్గర లోని అర ఎకరా వ్యవసాయ క్షేత్రం లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు.

- అంత్యక్రియలు జరిగే దగ్గరలో నూట యాభై మంది ఆర్మీ అధికారులు.

-  కుటుంభీకులు ,బంధువులు, వివిఐపి లకు మాత్రమే అనుమతి.

-  ప్రజలను సహకరించాలని కోరినా సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ,ఎస్పీ భాస్కరన్

2020-06-17 15:03 GMT



- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసిన రాజోలు జనసేన శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు.

- కరోన విపత్తు సహకరంగా సీఎం రిలీఫండ్ కు వచ్చిన చెక్కులను సీఎం జగన్ కు అందించిన రాపాక

2020-06-17 14:23 GMT

» అమరావతి-రాజ్ భవన్

- రోడ్డు ప్రమాద సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్

- మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపిన హరిచందన్

2020-06-17 14:23 GMT

♦ అమరావతి 

»  పవన్ కళ్యాణ్.....జనసేన అధినేత.....

- వేదాద్రి దగ్గరి రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం

- కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను.

- మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

- క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

- తెలంగాణలోని పెద గోపవరం గ్రామస్తులు వేదాద్రి నరసింహ స్వామి దర్శనం చేసుకొని వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకొందని తెలిసింది.

- ప్రమాద బాధితులకు అవసరమైన సహాయం, వైద్యం విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సేవలు అందించాలని కోరుతున్నాను.

- లారీ ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారంటే ఎంత తీవ్రంగా ప్రమాదం చోటుచేసుకొందో అర్థం అవుతోంది.

- గ్రామీణ ప్రాంతాల్లో సైతం మితిమీరిన వేగంతో లారీలు, ఇసుక టిప్పర్లు, ఇతర సరుకు రవాణా వాహనాలు తిరుగుతున్నాయని, భయమేస్తోందని ప్రజలు   వాపోతున్నారు.

- రవాణా, పోలీసు శాఖలు ఈ వేగానికి కళ్ళెం వేసి, రహదారి భద్రత నియమాలు అమలు చేయాలి.

2020-06-17 14:20 GMT

అమరావతి

- మండలిలో గంట నుంచి గందరగోళం

- రూల్ నెంబర్ 90 ని ఎలా అవకాశం ఇస్తారు అని మంత్రులు అభ్యంతరం

- ఛైర్మన్ పోడియం ముందుకు వెళ్లిన అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు

- గందరగోళం లో డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం

2020-06-17 14:19 GMT

» బ్రేకింగ్...

- హకీంపేట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై...

2020-06-17 14:17 GMT

» మరికొద్ది సేపట్లో హకీమ్ పేట్ కు చేరుకోనున్న సంతోష్ బాబు పార్థివదేహం...



- హకీమ్ పేట్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్.

- ఇప్పటికే చేరుకున్న సంతోష్ బాబు కుటుంబ సభ్యులు..

- హకీమ్ పేట్ కు వచ్చిన పలువురు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,మేయర్ బొంతు,డిజీపీ మహేందర్ రెడ్డి,

 హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు.

- హక్కింపెట్ ఎయిర్ ఫోర్స్ కి చేరుకున్న ప్రార్థివ దేహం.

Tags:    

Similar News