Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-10 01:07 GMT
Live Updates - Page 2
2020-06-10 04:05 GMT

శ్రీవారి దర్శనానికి టోకెన్లు

- నేటి నుంచి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు

- తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకోసం తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో దర్శన టోకెన్లు జారీ

- ప్రతిరోజూ 3 వేల ఉచిత దర్శన టికెట్లు జారీ చేయనున్న టీటీడీ

- భక్తులకు కేటాయించిన సమయంలో మాత్రమే దర్శనానికి రావాలని సూచన



2020-06-10 04:02 GMT

- ఈరోజు ఇంటర్నేషల్‌ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ)‌ సమావేశం

- టీ20 వరల్డ్‌ కప్‌నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం

2020-06-10 04:01 GMT

- నేడు సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కేసు విచారణ

- విచారించనున్న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం

- ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణ

2020-06-10 04:00 GMT

- నేటి నుంచి వందే భారత్‌ మిషన్‌ పేజ్‌-3

- జూలై 1 వరకు కొనసాగనున్న వందే భారత్‌ మిషన్‌ ఫేజ్‌-3

- వందేభారత్‌ మిషన్‌ ఫేజ్‌-3లో 300 విమానాలు నడపనున్న ఎయిరిండియా

- 43 దేశాల నుంచి 60 వేల మందిని తరలించనున్న ఎయిరిండియా

2020-06-10 02:29 GMT

నైరుతికి తోడైన అల్పపీడనం

- నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడనం తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

- ఇవి మరో రెండు రోజులు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- ప్రధానంగా ఇవి కోస్తాంద్ర వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

- మూడు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.                                -పూర్తి వివరాలు 



2020-06-10 01:44 GMT

'జగనన్న చేదోడు' పథకం ప్రారంభించనున్న సీఎం

- ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు జగనన్న చేదోడు పథకం ప్రారంభించనున్నారు.

- సీయం క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

- ఈ పథకంలో భాగంగా  షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.

- ఈ పధకం ద్వారా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం చేకూరనుంది.



Tags:    

Similar News