Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-07-28 23:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 29 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం దశమి (తె.03-15వరకు) తదుపరి ఏకాదశి విశాఖ నక్షత్రం (ఉ.8-33 వరకు) అమృత ఘడియలు ( రాత్రి 9-31 నుంచి 11-11 వరకు), వర్జ్యం (మ.12-24 నుంచి 1-57 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-14 నుంచి 9-05 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 12-22 నుంచి 1-55 వరకు) సూర్యోదయం ఉ.5-40 సూర్యాస్తమయం సా.6-31

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-07-30 17:01 GMT


ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 5549 మంది

తలనీలాలు సమర్పించిన వారు 1669 మంది

ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం 35 లక్షలు

2020-07-29 12:35 GMT

కరోనా నుంచి కోలుకుని తిరిగి విధులకు హాజరైన 34 మంది మహిళ పోలీసు సిబ్బందికి స్వాగతం పలికిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్...

బషీర్ బాగ్ లోని సిపి కార్యాలయంలో సిబ్బందిని సత్కరించిన సీపీ..

అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

కరోనా నియంత్రణలో పోలీసు శాఖ ముందు ఉండి పని చేస్తోంది.

కఠినమైన విధుల నిర్వహణలో మహిళ పోలీసులదే కీలక పాత్ర.

కరోనాను జయించి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ సిబ్బంది విధులకు హాజరవుతున్నారు...

2020-07-29 12:35 GMT

ప్రగతి భవన్...

సచివాలయ నూతన నిర్మాణంపై సీఎం సమీక్ష

పూర్తైన సచివాలయ పాత భవనాల కూల్చివేతలు

బిల్డింగ్ ల వ్యర్థాలను ముమ్మరంగా తరలింపు

సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ డిజైన్ లపై ఆర్కిటెక్ట్ లతో చర్చ

2020-07-29 12:34 GMT

మంత్రి ఈటల రాజేందర్..

కరోనా వైరస్ లో ట్రెసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ కీలకం

ముందే గుర్తిస్తే నయం చేయటం సులభం

అన్ని ఆస్పత్రుల్లో కలిపి 16 వేల టెస్టుల వరకు చేస్తున్నాం..

లక్షణాలు లేకపోతే హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతున్నాం..

ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా ట్రీట్మెంట్ చేస్తుంది ప్రభుత్వం

2020-07-29 12:34 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపకనియోజకవర్గం స్థానిక TRS MLA రేగా కాంతరావు మణుగూరు లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమించారంటూ కాంగ్రెస్ నాయకుల ఆందోళన... మణుగూరులోని తమ పార్టి కార్యాలయాన్ని తమకు అప్పజెప్పాలంటూ అంబెడ్కర్ సెంటర్ లొ రిలేనిరహార దీక్ష లు ప్రారంభించిన CLP నేత బట్టి విక్రమార్క.


2020-07-29 12:33 GMT

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్రీ లక్మి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల దర్శనం సమయంలో మార్పులు చేసిన ఆలయ అధికారులు...

👉ఉదయం 8-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంటల వరకు తిరిగి సాయంత్రం 4-00 గంటల నుండి 5-30 వరకు భక్తులకు అనుమతి...

👉అనంతరం స్వామివారికి నివేదిన,హారతి, మంత్ర పుష్పం నిర్వహించి 6గంటలకు ద్వారబంధనం..

2020-07-29 12:33 GMT

కె.కృష్ణసాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరం భూమి పూజకు వెళ్లడం పై అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖలను బీజేపీ ఖండిస్తుంది.

అసలు ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ఎన్నిసార్లు స్వయంగా తాను చేసిన ప్రమాణాలను మరచి ప్రవర్తించాడో గుర్తు చేసుకోవాలి.ఎం ఐ ఎం పార్టీ పేరులోనే మతం ఉంది.అటువంటి అతను ఇతరులకు సెక్యులరిజం మీద లెక్చరర్లు ఇవ్వడం మానుకోవాలి.

ఒక మతం కేంద్రంగా నడిచే ఎం ఐ ఎం అనే పార్టీకి నాయకత్వం వహిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ కి సెక్యులరిజం విషయంలో ఏ విధమైన విశ్వసనీయత లేదు. కాబట్టి అతను ఇతరులకు లెక్చరర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.

ప్రపంచంలోని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య దేశాల్లో అధ్యక్షులకు, ప్రధానులకు వారి వారి మత విశ్వాసాలను పాటించే హక్కు ఉంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన వ్యక్తిగత హోదాలోనూ,ప్రధాని హోదాలోనూ అయోధ్య భూమి పూజలో పాల్గొనవచ్చు. దానికి ఏవిధమైన నైతిక,చట్టపరమైన,రాజ్యాంగ పరమైన సమస్య లేదు. అంతేకాదు దీనిమీద ఎవరి తప్పుడు వ్యాఖ్యలకి ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన పనిలేదు. ఓవైసీ లాంటి వారు తమ స్వంత రాజకీయ ఎజెండాలో భాగంగా ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమని మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టవద్దని బీజేపీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని హెచ్చరిస్తుంది. నిజానికి ఈ సమస్యకు శాంతియుత ,శాశ్వత పరిష్కారం దొరికినందుకు ఓవైసీ లాంటి వారు దీన్ని స్వాగతించాలి.

ఆ మాటకొస్తే అసలు అసదుద్దీన్ ఓవైసీ ఈ అయోధ్య భూమి పూజలో పాల్గొని తన లౌకిక స్ఫూర్తిని అలాగే మతసామరస్య భావాన్ని అలాగే 80%మంది హిందువుల పట్ల తన సోదరభావాన్ని చాటు కోవాలి.

2020-07-29 12:32 GMT

మహబూబ్ నగర్ జిల్లా: భూత్పురు మున్సిపల్ పరిధిలోని నల్లగుట్ట తండా గుట్ట వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, సీడ్ బాల్స్ ను వెదజల్లిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.


2020-07-29 10:50 GMT

బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో, భవ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ప్రధానిపై అసదుద్దీన్ ఓవైసీ చవకబారు విమర్శలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి.

అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు, ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వస్తున్నారు. ఈ ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందింది కాదు, ఇది భారతీయుల ఆలయం. కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో, ప్రధానిగా నరేంద్రమోదీ పాల్గొనడం, భారతీయులందరికీ గర్వకారణం.

400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉంది అనడం, నిజమైతే మరీ అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న శ్రీ రామ మందిరంను మరి ఎవరు ధ్వంసం చేశారు..?

సుప్రీం కోర్టు తీర్పు తదనంతరం, భారత ప్రభుత్వం కోర్టుకు నివేదించిన మేరకు, ఎటువంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నది.

2020-07-29 10:49 GMT

రాచకొండ కమీషనరేట్: ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్. వంశీ రెడ్డి అలియాస్ కృష్ణా రెడ్డి ని అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. పరారీలో ఉన్న ప్రధాన నిర్వాహకురాలు అంజలీ..చిన్నా. నలుగురు యువతులను కాపాడిన పోలీసులు. వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కాగా మరో యువతి విజయవాడ కు చెందినదిగా గుర్తింపు. నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Tags:    

Similar News