Live Updates:ఈరోజు (జూలై-14) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-07-14 02:20 GMT

ఈరోజు మంగళవారం, 14 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం నవమి(సా. 6-33 వరకు) తర్వాత దశమి, అశ్వని నక్షత్రం (మ.01-20 వరకు) తర్వాత భరణి నక్షత్రం.. అమృత ఘడియలు (తే . 4-21 నుంచి ఉ. 7-08 వరకు), వర్జ్యం (ఉ. 8-54 నుంచి 10-40 వరకు, తిరిగి రాత్రి 11-54 నుంచి 1-40 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-11 నుంచి 9-03 వరకు రా. 10-58 నుంచి 11-42 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-07-14 15:13 GMT

కొత్తపల్లి: కొత్తపల్లి మండలం సారా బట్టీలు పై పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు.

- శ్రీరాంపురం పాతివారి పాకలు తదితర ప్రాంతాల్లో పోలీసులు సారా బట్టీలు పై దాడులు నిర్వహించినట్లు సీఐ సూరి అప్పారావు తెలిపారు.

- ఇద్దరు వ్యక్తులను ఆరు గ్యాస్ సిలిండర్లను రెండు గ్యాస్ పొయ్యి లను 3,400 లీటర్ల బెల్లపు ఊట, 110 లీటర్ల సారా ను స్వాధీనపరుచుకున్న ట్లు పిఠాపురం సిఐ సూర్య అప్పారావు తెలిపారు.

- పిఠాపురం నియోజకవర్గ పరిధిలో సారా అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.



2020-07-14 15:11 GMT

రోలుగుంట: గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.

- వచ్చే నెల 9న జరిగే ఆదివాసుల దినోత్సవం సందర్భంగా భూ పంపిణీ కార్యక్రమంలో వీరందరికీ పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు.

- విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని గిరిజన గ్రామాలను సందర్శించారు.

- మండలంలోని 16 గ్రామాల్లో గిరిజనులు జీవిస్తున్నారని, వీరంతా ఆయా సమీపంలోని అటవీ భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ నేటి వరకు సాగు హక్కు పత్రాలను పంపిణీ చేయలేదని చెప్పారు.

- ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సీపీఎం నాయకులు చిరంజీవి, శ్రీనివాసరావు తదితరులు డిమాండ్ చేశారు. 

2020-07-14 15:10 GMT

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పని చేస్తున్న 140 మంది ఒప్పంద ఉద్యోగులను దేవస్థానం తొలగించింది.

- నిర్వహణ కష్టం కావటం.. కరోనా వైరస్ వల్ల భక్తుల రాక తగ్గడంతో ఉద్యోగులను తొలగిస్తున్నామని, అధికారులు తెలిపారు.

- స్వామివారి గోశాలలో ఈ ఒప్పంద ఉద్యోగులను తొలగించటం వల్ల గోవుల సంరక్షణ లేక గోవులను చూసే బాధ్యతను సానిటరీ సిబ్బందికి అప్పజెప్పారు.

- వారికి ఈ నిర్వహణ తెలియకపోవటంతో గోవులకు రెండు రోజులుగా పాలు పితకటం లేదు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఒప్పంద ద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

2020-07-14 14:02 GMT

- కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15 వేలు ఆర్ధిక సహాయం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం..

- తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు ఆదేశం...

2020-07-14 12:54 GMT

కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏయే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆయా పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

- పూర్తి వివరాలు 

2020-07-14 12:52 GMT

రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే పదో తరగతి విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. టెన్త్ పరీక్షలు రాయకుండానే విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా ఎస్‌ఎస్‌సీ, ఎఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ పరీక్షలన్నీ రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- పూర్తి వివరాలు 

2020-07-14 08:54 GMT

- సచివాలయం కుల్చివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్.

- పిటిషన్ వేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.

- పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా సచివాలయం కూల్చి వేస్తున్నారు.

- ఈ విషయం పై వెంటనే జోక్యం చేసుకోవాలని ఎన్జీటీ రేవంత్ రెడ్డి విజ్ఞ్యప్తి.

2020-07-14 08:48 GMT

- ఆంధ్రప్రదేశ్ లో ఇంద్ర ఏసి బస్సులను కారోనా సంచార టెస్టులుగా మారుస్తున్నారు.

- ఈ బస్సులకు సంజీవని అని నామకరణం చేసారు.

- కర్నూల్ జిల్లా కు నాలుగు బస్సులను కేటాయించారు.

- సంజీవని బస్సులో టెస్ట్ లు చేసి అప్పటికప్పుడే ఫలితాలను వెల్లడిస్తారు. 

2020-07-14 08:29 GMT

- కృష్ణ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. పలు గ్రామాలలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

- దీంతో రహదారుల మీద వర్షపు నీరు ప్రవహించడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

- తిరువూరు మండలంలో పొంగుతున్న వాగులు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన లారీ.  

Tags:    

Similar News