Good News to AP Students from CM Jagan: ఏపీలో పదో తరగతి విద్యార్థులందరూ పాస్‌!

Good News to AP Students from CM Jagan: ఏపీలో పదో తరగతి విద్యార్థులందరూ పాస్‌!
x
Highlights

Good News to AP Students from CM Jagan: రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే పదో తరగతి విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించిన

Good News to AP Students from CM Jagan: రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే పదో తరగతి విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. టెన్త్ పరీక్షలు రాయకుండానే విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా ఎస్‌ఎస్‌సీ, ఎఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ పరీక్షలన్నీ రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 2020 మార్చి నాటికి నమోదైన టెన్త్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇక విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్స్‌ లేకుండానే పాస్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఏపీ లోని టెన్త్ క్లాస్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6,30,804 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా టెన్త్ క్లాస్ విధ్యార్ధులను పరీక్ష లేకుండానే పాస్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి తాజాగా గడచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1909 మంది కరోనా బారిన పడ్డారు.. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33,019 కి చేరుకుంది. ఇక 952 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,528 యాక్టివ్ కేసులు ఉండగా, 15,227 మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనాతో 408 మంది మృతి చెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories