SP Balu Tested Negitive: కరోనాను జయించిన ఎస్పీ బాలు.. ధన్యవాదాలు తెలిపిన ఎస్పీ చరణ్
నా తండ్రి కోసం మీ నిరంతర మద్దతు , ప్రార్థనలకు ధన్యవాదాలు ..
నా తండ్రి బాగానే ఉన్నాడు మరియు స్థిరంగా ఉన్నాడు. కరోనా నెగిటివ్ వచ్చింది
ధన్యవాదాలు, ఎస్.పి చరణ్
Minister Harish Rao: అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా : నారాయణ రావు పేట మండలం గుర్రాల గొంది గ్రామంలో నూతనంగా నిర్మించిన సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.
GODAVARI INFLOW UPDATES: స్వల్పంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో స్వల్పంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం.
42 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటి మట్టం.
సుమారు 12 అడుగులు తగ్గిన వరద .
మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న అధికారులు
JURALA PROJECT: జూరాల ప్రాజెక్టుకు తగ్గుముఖం పట్టిన వరద
మహబూబ్ నగర్ జిల్లా : జూరాల ప్రాజెక్టుకు తగ్గుముఖం పట్టిన వరద 20 గేట్లు ఎత్తి వేత
ఇన్ ఫ్లో: 1 లక్ష 78 వేల క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 1 లక్ష 63 వేల 627 క్యూసెక్కులు.
పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:
9.657 టీఎంసీ.
ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.377 టీఎంసీ.
పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
ప్రస్తుత నీటి మట్టం: 317.880 మీ.
Telangana Praja Front: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షునికి స్పెషల్ కోర్ట్ బెయిల్
NIA స్పెషల్ కోర్ట్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నాలమాస కృష్ణ కు NIA స్పెషల్ కోర్ట్ బెయిల్ మంజూరు..
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన NIA స్పెషల్ కోర్ట్..
మావోయిస్టుల తో సంబంధం ఉన్న ఆరోపణలతో గతంలో అరెస్ట్ చేసిన NIA..
ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నాలమాస కృష్ణ... ..
నేడు బెయిల్ పై విడుదల కానున్న కృష్ణ....
Minister Thalasani Warangal Tour: నేడు తలసాని వరంగల్ రూరల్ పర్యటన
వరంగల్ రూరల్ జిల్లా: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,
రాయపర్తి మండలంలోని చెరువుల్లో సబ్సిడీ చేపపిల్లలను లబ్ధిదారులకు అందించనున్న మంత్రి తలసాని.
జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు.
Kadem Project: కడెం ప్రాజెక్టులో జలకళ
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు
ప్రస్తుతం నీటి నిల్వ:- 6.82
పూర్తిస్థాయినీటినిల్వ7.603 TMc
ప్రస్తుతం నీటి మట్డం- 696.92
గరిష్ట నీటిమట్టం700 Ft
ఇన్ ప్లో 807 c/
అవుట్ ప్లో:- 594 c/s
Saraswathi Barrage: సరస్వతి బ్యారేజ్ గేట్లు మూసిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సరస్వతి బ్యారేజ్
గేట్లు మూసిన అధికారులు
పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 116.500 మీటర్లు
పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 5.87 టీఎంసీ
ఇన్ ఫ్లో 22,222 క్యూసెక్కులు
ఓట్ ఫ్లో నిల్ క్యూసెక్కులు
Srisailam power plant accident: శ్రీశైలం జల విద్యుత్ ప్రమాదం: మృతులకు నివాళులర్పించిన కె.టి.పి.పి విద్యుత్ ఉద్యోగులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 2కోట్ల రూపాయలు ఎక్స్ గ్రేషియ ప్రకటించి వారి కుటుంబలను ఆదుకోవాలని.
గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 11వందల మెగావాట్ల కేంద్రం(కె.టి.పి.పి)కాలనిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించిన కె.టి.పి.పి విద్యుత్ ఉద్యోగులు.