Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 24 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం షష్ఠి (రా. 7-04 వరకు) తదుపరి సప్తమి స్వాతి నక్షత్రం (రా. 8-35 వరకు) తదుపరి విశాఖ అమృత ఘడియలు: (మ. 12-23 నుంచి 1-53 వరకు) వర్జ్యం: (రా. 1-49 నుంచి 3-19 వరకు) దుర్ముహూర్తం: లేదు రాహుకాలం: (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-47 సూర్యాస్తమయం: సా.6-18

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 24 Aug 2020 12:17 PM GMT

    బ్రేకింగ్..

    నిరుద్యోగులను మోసం చేస్తున్న చీటర్ ను అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు...

    ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడ్డ ఫరీద్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు....

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తనకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయంటూ నిరుద్యోగులను మోసం చేసి 3కోట్ల 45 లక్షలు వసూలు చేసిన ఫరీద్....

    కుత్బుల్లాపూర్ కు చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సిసిఎస్ పోలీసులు....

  • 24 Aug 2020 12:16 PM GMT

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    లక్ష్మీ బ్యారేజ్

    65 గేట్లు ఎత్తిన అధికారులు

    పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    ప్రస్తుత సామర్థ్యం 94.30 మీటర్లు

    పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    ప్రస్తుత సామర్థ్యం 3.686 టీఎంసీ

    ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 3,46,730 క్యూసెక్కులు

  • 24 Aug 2020 12:16 PM GMT

    సిద్దిపేట జిల్లా:

    నారాయణ రావు పేట మండలం మాటేండ్ల గ్రామంలో బాల వికాస నీటి శుద్దీకరణ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

    నారాయణ రావు పేట మండలం మాటేండ్ల గ్రామంలో రెండు నిలువెత్తు గాంధీ విగ్రహాలను ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

    నారాయణ రావు పేట మండలం మాటేండ్ల గ్రామంలో Egs నిధులు రూ.2.5 లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాల వంట గదిని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

    నారాయణ రావు పేట మండలం మాటిండ్లలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి గ్రామంలో రెండు చోట్ల మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణలు, సెగ్రి గ్రేషన్ షెడ్, వైకుంఠ ధామం, గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేపట్టారు. అంతకు ముందు సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

  • 24 Aug 2020 10:44 AM GMT

    శ్రీనివాస్ గౌడ్ టూరిజం శాఖ మంత్రి...

    వారం రోజుల క్రితం సినిమా రంగంలోని ప్రముఖులు మంత్రి కేటీఆర్ ని కలిసినప్పుడు కరోనా వల్ల ఇతర దేశాలకు పోలేని పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్స్ ఇక్కడే చేసుకుంటామని కొరారు..

    దానిలో భాగంగా నే ఈ రోజు నిర్మాతల తో సమావేశం...

    సింగిల్ విండో సిస్టం తో షూటింగ్ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్స్ కి అనుమతి...

    తెలంగాణ లో షూటింగ్ కి సంబంధించిన అనేక ప్రాంతాలు ఉన్నాయి...

    తెలంగాణ లో 50 నుండి 60 వరకు మంచి లొకేషన్ లు ఉన్నాయి...

    ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో అడవులు,రిజర్వాయర్ లు ఉన్నాయి...

    వికారాబాద్ లో అనంతగిరి హిల్స్ ఉన్నాయి...

    కుంతలా, భోగతల జపాలతలు మన దగ్గర ఉన్నాయి...

    తెలంగాణ ప్రజలు చాలా మంచివారు ..ఇక్కడ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని నిర్మాతలు ముందుకొస్తున్నారు..

    15రోజుల్లో తెలంగాణ లో షూటింగ్స్ పై నివేదిక తయారుచేసి ముఖ్యమంత్రి కి నివేదిక అందిస్తాం....

    తెలంగాణ లోని లొకేషన్స్ లో సినిమాలు తీస్తే భారీగా బడ్జెట్ తగ్గుతుంది..

    నిర్మాతలు తెలంగాణ లో పర్యటించి లొకేషన్స్ చూడాలి....

    లొకేషన్స్ పరిశీలించి మళ్ళీ కేటీఆర్ తో సమావేశం అవుతాము...

    కరోనా వల్ల బయటకు పోలేమని తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లోనే షూటింగ్స్ చేస్తామని నిర్మాతలు తెలిపారు...

  • 24 Aug 2020 10:44 AM GMT

    ఏసీబీ కోర్ట్....

    కీసర తహశీల్దార్ కేసులో నలుగురు నిందితులకు కస్టడీలోకి అనుమతించిన ఏసీబీ కోర్ట్....

    తహశీల్దార్ నాగరాజు, శ్రీనాథ్, అంజిరెడ్డి, విఆర్ఏ సాయిరాజ్ మూడు రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్ట్....

    ఈ నెల 25 నుండి 27 వరకు ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్ట్.

    చంచల్ గూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ...

    రేపటి నుండి మూడు రోజుల పాటు నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో విచారించనున్న ఏసీబీ..

    కోటి 10 లక్షల రూపాయల పై కూపీ లాగనున్న ఏసీబీ...

    తహసీల్దార్ నాగరాజు సమక్షంలో బ్యాంక్ లాకర్ ను ఓపెన్ చేయనున్న ఏసీబీ...

    ఆంజిరెడ్డి, శ్రీనాథ్ ఇంట్లో దొరికిన ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వివరాలు సేకరించనున్న ఏసీబీ.

  • 24 Aug 2020 10:44 AM GMT

    కాంగ్రెస్ పార్టీ నేతలంతా పూర్తిగా గాంధీ కుటుంభం వైపే ఉంటుంది

    టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్

    23 మంది సీనియర్ల నాయకులు గాంధీ కుటుంభంపైన లేఖ రాయడం క్రమశిక్షణా రాహిత్యం..

    పైరవీలు చేసుకుని రాజకీయాలు చేసే నాయకులు పార్టీ పరువు తీస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి.

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంభం వెనకాలే ఉంటుంది.

    పార్టీ పరిస్థితి బాగా లేని సమయంలో, సోనియాగాంధీ కి ఆరోగ్యం బాగా లేని సమయంలో ఇలా సీనియర్లు లేఖ రాయడం సమంజసమా..

    వారందరిపైనా పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలి.. కుసుమకుమార్..

  • 24 Aug 2020 10:43 AM GMT

    మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్...

    రేపు అత్యంత కీలకమైన సి డబ్ల్యూ.సి సమావేశం ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సోనియా గాంధీ గారికి లేఖ రాయడం అది మీడియాకు లీక్ చేయడం బాధాకరం..

    పార్టీ అంతర్గత విషయాలు పార్టీ వేదికల మీద ప్రస్తావించాలి.. ఇది పార్టీ కి అన్ని విధాలా మంచిది..

    ఇలాంటి లేఖలు, లీకులు పార్టీలో మంచి పరిణామం కాదు..

    గాంధీ కుటుంభం అంటే ఈ దేశానికి ఆదర్శం, జీవితాలను, ప్రాణాలను త్యాగాలు చేసిన కుటుంబం..

    ఈ దేశ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంభం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది..

    గాంధీ కుటుంభం నుంచే ఏఐసీసీ అధ్యక్షులు ఉండాలి. ఆ కుటుంభం పదవుల కోసం ఆశపడే కుటుంభం కాదు...

    ఇది దేశంలో ప్రతి కార్యకర్త కోరుకుంటున్న విషయం..

    సీనియర్లు కూడా పార్టీ బాగు కోసమే ఆలోచిస్తున్నారు. కానీ ఈ రకంగా లేఖల ద్వారా అభిప్రాయాలు చెప్పడం.. దాన్ని లీక్ చేయడం పార్టీకి శ్రేయస్కరం కాదు..

  • 24 Aug 2020 10:43 AM GMT

    అసెంబ్లీ మీడియా పాయింట్

    *భట్టి విక్రమార్క

    సిఎల్పీ నేత*

    ప్రభుత్వాన్ని తట్టిలేపి, ప్రజల పక్షనా సోనియా, రాహుల్ పోరాడారు

    కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చుతున్న తరుణంలో లేఖలు రాయడం శోచనీయం

    కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీ కి, రాహుల్ గాంధీకి అండగా నిలబడాలి

    గత ఆరు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారు.

    లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుప్తచేతనావస్థ లో ఉన్నారు.

    రాహుల్ గాంధీ

    దేశవ్యాప్త పర్యటన చేయాలి.

    లౌకికవాదులు బడుగు బలహీన వర్గాలు రాహుల్ గాంధీ వెంటే ఉంటారు.

    జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ

    కాంగ్రెస్ పార్టీ లో పదవులు అనుభవించి ఇప్పుడు కొందరు పార్టీకి వ్యతిరేకంగా లేఖలు రాస్తున్నారు

    సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అధికార కాంక్షతో లేరు

    కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం పనిచేయాలి

    రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి

    శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే

    కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ కార్యకర్త సోనియా, రాహుల్ నాయకత్వం కోరుకుంటున్నారు

    బహిరంగ లేఖ రాసిన నేతల తీరును ఖండిస్తున్నాం

    బహిరంగ లేఖ రాసిన నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  • 24 Aug 2020 10:43 AM GMT

    బ్రేకింగ్ న్యూస్...

    ఆన్ లైన్ బెట్టింగ్ పాల్పడినవారిని అరెస్ట్ చేసిన కేసు తెలిసిన విషయమే.

    వీరు ఎన్ని బ్యాంకులకు ట్రాన్సాక్షన్ చేశారు మరిన్ని కంపెనీల లావాదేవీలు జరిగాయి అని.

    సమగ్ర విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసిన సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.

    4 రోజుల కస్టడీ కి ఇచ్చిన నాంపల్లి న్యాయస్థానం. చంచల్ గూడ జైలు నుండి వారంటే పై ఒక చైనా దేశస్థుడు పాటు మరో ముగ్గురు వ్యక్తులను జైలు నుండి సిసిఎస్ కు తీసుకువచ్చిన పోలీసులు.

    నలుగురు వ్యక్తులు ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ స్కాం లో ఎంతమంది ఉన్నారో అనే కోణం మీద దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం పోలీసులు.

    పదకొండు వందల కోట్ల రూపాయలు చైనాలోని బీజింగ్ టుమారో కంపెనీ కీ బదలీ చేయడంపై దృష్టి..

    రెండు అకౌంట్లు ద్వారా హెచ్ ఎస్ బి సి బ్యాంకు అమౌంట్ బదిలీ చేసినట్లు నిర్ధారణ..

    ఆన్లైన్ బెట్టింగ్ వచ్చిన డబ్బులు పేటీఎంలో డిపాజిట్ చేయించిన చైనా కంపెనీ.

    2019 లో కేవలం ఐదు కోట్ల రూపాయల బిజినెస్ చేసిన చైనా కంపెనీ.

    ఈ ఏడాది ఆరు మాసాల్లో 1102 కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన బీజింగ్ టుమారో కంపెనీ..

    లాక్ డౌన్ లోనే ప్రజల సొమ్ముని ఆన్లైన్ బెట్టింగ్ కొట్టేసిన చైనా కంపెనీ.

    అయితే విచారణలో మరి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

    నిందితులు పోలీసులకు సహకరిస్తే మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది...

  • 24 Aug 2020 10:42 AM GMT

    మహబూబాబాద్ జిల్లా...

    మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లోని కోవిడ్ వార్డ్ ను సందర్శిచి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రులు ఈటెల. రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్...

Print Article
Next Story
More Stories