Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-23 01:00 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-23 16:28 GMT

తూర్పు గోదావరి :

-- ఏపియుడబ్ల్యూజె కృషితో కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్ధికసాయం

-- మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. ఏపీలో కరోనాతో మృతి చెందిన 45 మందికి పైగా జర్నలిస్టులు..

-- సిఎం జగన్ కు కృతజ్నతలు తెలిపిన     ఏపియుడబ్ల్యూజె తూర్పు గోదావరి జిల్లా కమిటీ..

2020-10-23 16:12 GMT

  అమరావతి..

-వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన చంద్రబాబు

-పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, మండల టిడిపి బాధ్యులు

-ఎప్పుడూ చూడని ఉన్మాద పాలన రాష్ట్రంలో చూస్తున్నాం

-ఎప్పుడెలా ప్రవర్తిస్తారో, ఎవరినేం చేస్తారో, ఏ విధ్వంసం సృష్టిస్తారో అర్ధంగాని పరిస్థితి ఉంది.

-ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది’’ తయారు అవుతున్నాడు.

-బీసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దాడులు..

-ఆడబిడ్డలపై అత్యాచారాలు.. దేవాలయాలకే రక్షణ లేకుండా పోయింది.

-జగన్ రెడ్డి నోరుతెరిస్తే అబద్దాలు..చేసేదంతా అరాచకం.

-ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు..భయోత్పాత హింసాత్మక చర్యలు..

-జగన్ రెడ్డి ప్రచారం పిచ్చ పరాకాష్టకు చేరింది.

-సర్వేరాళ్లపై కూడా జగన్ రెడ్డి బొమ్మలు.. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు..

-పాత స్కీములకే కొత్తపేర్లు పెట్టి, వాటిపై యాడ్స్ కు కోట్లాది రూపాయల వ్యయం..

-గ్రానైట్ సర్వే రాళ్లు వేయడం, వాటిపై జగన్ రెడ్డి బొమ్మలు వేయడం మరో తుగ్లక్ చర్య..

-రాజధాని 3ముక్కలు చేయడం, పాత స్కీమ్ లకే కొత్త పేర్లు పెట్టడం, తుగ్లక్ పాలనతో రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారు.

-బీమా పథకం’’ ఏడాదిన్నరగా ఎందుకు ఆపేశారు..?

-పేరుమార్చి ఇప్పుడు చేసిందేమిటి..? ఇన్ని ఆంక్షల బీమా వల్ల ఎవరికేం లాభం..?

-దీనికోసం ఏడాదిన్నరగా బీమా పథకం లబ్ది పేదలకు ఎందుకు దూరం చేశారు

-ఆ కుటుంబాలకు జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు..?

-బెంజ్ మినిస్టర్ ఒకరు, హవాలా మినిస్టర్ మరొకరు, బూతుల మంత్రి ఇంకొకరు..

-బెట్టింగ్ మంత్రి ఒకరైతే, పేకాట మంత్రి ఇంకొకరు..

-ఎ1, ఎ2 నుంచి ఎ7, ఎ8 దాకా ప్రభుత్వ పదవుల్లోకి చేరారు.

-ముద్దాయిల పాలనలో రాష్ట్రం ముద్దాయిల ఇష్టారాజ్యంగా మారింది.

-శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియా...4 మూల స్థంభాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

-రాజ్యాంగంపై గౌరవం లేదు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు.

-ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లు గడ్డాలు పట్టుకుని తీసుకుని ఇదే ఆఖరి ఛాన్స్ చేసుకున్నారు.

-కరోనా పరిస్థితులను సరిగ్గా ఎదుర్కొంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వచ్చేవిగావు

-సమస్యను అంచనా వేయడంలో వైఫల్యం,

-సమస్యను సమర్ధంగా ఎదుర్కోవడంలో వైఫల్యం, బాధితుల్లో భరోసా పెంచడంలో నిర్లక్ష్యం...

-ప్రజల ప్రాణాలంటే జగన్ రెడ్డికి లెక్కలేదు. ప్రజారోగ్యం పట్ల శ్రద్దలేదు.

2020-10-23 16:08 GMT

అమరావతి

-దసరా రోజున ఆదివారం కావడంతో సోమవారం కు ఆ శలవును మార్చవలసిందిగా కోరిన మహిళా ఉద్యోగులు

-మహిళా ఉద్యోగుల అభ్యర్థన పై సానుకూలంగా స్పందించిన సర్కార్

-ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ నీలం సాహ్ని

2020-10-23 16:01 GMT

  అనంతపురం:

//టీడీపీ పరిపాలనలో రైతులను పట్టించుకోని తెలుగుదేశం నేడు రైతుల పై కపట చూపిస్తుంది.

//అసలు రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఉన్నారు... ఆ లెక్కలు తెలియని లోకేష్ రైతుల గురించి ఏం మాట్లాడుతారు..

//వేరుశనగ, మొక్కజొన్న, కంది పంటలు అంటే తెలియని నారా లోకేష్ ముందుగా తెలుగు మాట్లాడడం నేర్చుకోవాలి.

//మీ పార్టీ నాయకులను, క్యాడర్ ను కాపాడుకునేందుకే జిల్లా పర్యటనలు చేస్తున్నారు తప్ప రైతుల మీద ప్రేమతో కాదు.

//ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే స్థాయి నారా లోకేష్ కు లేదు.

2020-10-23 15:42 GMT

తిరుమల

-8వ రోజు రాత్రి అశ్వ వాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి

-కోవిడ్-19 ప్రభావంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేసిన టీటీడీ

-రేపు ఉద‌యం 6 నుండి 9 గంట‌ల మధ్య (అద్దాల మ‌హ‌ల్‌లో)

-స్న‌ప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్న ఆలయ అర్చకులు.

-రేపటితో ముగియనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

2020-10-23 15:35 GMT

 తూర్పుగోదావరి :

-జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిసి కామెంట్స్..

-మాస్క్, సామాజిక దూరం, శానిటేజర్ ల ద్వారా కరోనాను నియంత్రణ చేయవచ్చు..

-జిల్లాలో నవంబర్ పదిహేను నుంచి పాఠశాలల ప్రారంభం దృష్యా ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం..

-కేరళ లో ఓనం పండుగ తర్వాత కరోనా కేసులు పెరిగాయి.. దసరా పండగ రోజుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి..

-ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలకు వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది..

-వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటి వరకు 86 శాతం రేషన్ పంపిణీ చేశాము..

-ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరిగిన నష్టం పై అంచనా రూపొందించి ప్రభుత్వానికి పంపించాము..

-అక్టోబర్ లో జరిగిన నష్టం పై అంచనాలు ఈ నెల ఆఖరి కల్లా పూర్తి చేస్తాము..

2020-10-23 15:14 GMT

జాతీయం

-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి

-పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రాష్ట్రానికి అన్యాయం

-2016లో స్పెషల్ ప్యాకేజీ పేరుతో 2014 నాటికి ఖర్చులకు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ఒప్పందం చేసుకుంది

-ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు

-సెప్టెంబరులో మిడ్నైట్ డీల్ కుదుర్చుకున్నారు

-ఆ గొప్ప ప్యాకేజీలో భాగంగా 2014 నాటి ఖర్చు ఇస్తే చాలు అని టిడిపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది

-పునరావాసం, భూసేకరణ ఖర్చు , ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు పెరిగే అవకాశం ఉందన్న క్యాబినెట్ తీర్మానం పక్కన పెట్టారు

-ఈ అంశాన్ని గతంలోనే జగన్ ప్రతిపక్ష నేతగా ప్రశ్నించారు

-నాడు పట్టిసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టు ఏడాదిన్నర ఆలస్యం చేశారు

-కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడితే కాంట్రాక్టులు దక్కవని చంద్రబాబు ప్రభుత్వం ఇలా ప్రవర్తించింది

-రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును సిడబ్ల్యుసి ద్వారా కన్ఫర్మ్ చేయాలని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు

-బాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు

-అంచనాలు రివైజ్డ్ చేస్తున్న సమయంలో టిడిపి ప్రభుత్వ బండారం బయటపడింది

-రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కండిషన్స్ లేకుండా రియంబర్స్ చేయాలి

-సొంత కాంట్రాక్టుల కోసం సంవత్సరన్నర పాటు పోలవరం పట్టించుకోలేదు

-టిడిపి పాలన వల్ల రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది

-2016వ సంవత్సరంలో 2014 ఖర్చుకు పరిమితం కావాలని ఒప్పుకోవడమే తప్పు

-ప్రాజెక్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది

2020-10-23 15:06 GMT

  అమరావతి

-కేంద్ర వ్యవసాయ మంత్రి పురుషోత్తం తో వర్చ్యువల్ సమావేశం లో పాల్గొన్న సోము వీర్రాజు

  సోము వీర్రాజు

-భారీ వర్షాలతో కృష్ణ, గోదావరి నదులతో పాటు, అనేక ఉపనదులు, ప్రవాహాలు, కాలువలు మరియు చెరువులు పొంగి పొంగి గ్రామాలను నింపాయి.

-పొలంలో వరి, పత్తి, మిల్లెట్, వేరుశనగ, అరటి, ఉల్లిపాయ వంటి ఉద్యాన పంటలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

-పార్టీకి చెందిన నాలుగు బృందాలు వరద పీడిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేశాయి.

-జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు రాష్ట్రంలో వరద పరిస్థితులు, రైతులకు జరిగిన నష్టాన్ని వివరించారు

-రాష్ట్ర రైతులకు.. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయం, సహకారం అందించాలని కోరుతున్నాం

-నివేదికలను ఇప్పటికే వ్యవసాయ మంత్రిత్వ శాఖకు పంపారు,

-వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం

-వరద నివారణ సమస్యలు, నష్టాలను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది

-కనీసం తక్షణ పరిహారం కూడా ఇవ్వలేదు

-ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా.. పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రితో వరదలు గురించి మాట్లాడారు,

-ముఖ్యమంత్రి తగినంతగా స్పందించలేదు.

-నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే బృందాలను పంపాలి.

2020-10-23 15:03 GMT

  అమరావతి..

-- చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్ జిఓ అధ్యక్షుడు

-- రెండు నెలల 50శాతం జీతం ఇవ్వాలని కోరాం

-- పెన్షనర్ల ఒక నెల 50శాతం పెండింగ్ జీతం ఇవ్వాలని కోరాం

-- నవంబర్ నెలలో పెండింగ్ జీతం సీఎం చెల్లిస్తామన్నారు

-- 11వ పీఆర్ సి ని వెంటనే అమలు చేయమని కోరాం

-- సీపీఎస్ రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని కోరాం

-- కాంట్రాక్ట్ ఉద్యొగులను రెగ్యులర్ చేయాలని కోరాం

-- ప్రతి ఉద్యోగికి రిటైర్డ్ అయ్యాలోపు ఇంటి సౌకర్యం కల్పించాలని కోరాం

-- మహిళ టీచర్స్ తరహాలో మహిళ ఉద్యోగులకు 5 స్పెషల్ క్యాజువల్ లెవ్ ఇవ్వాలి

-- కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30రోజులు సెలవు ఇవ్వాలి

-- రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు మరింత సహకరించాలని సిఎం జగన్ కోరారు

-- ఉద్యోగులంతా మరింత చొరవతో పనిచేసేందుకు రెడీగా ఉన్నాం

-- సీఎం జగన్ మా డిమాండ్స్ పట్ల సానుకూలంగా స్పందించారు

2020-10-23 15:00 GMT

  విజయవాడ

//మోకా సూరిబాబు, అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడు

//అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వార్ల దేవస్థానం నుంచి ఏటా దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాం

//ఏటా దసరా ఉత్సవాల్లో దుర్గమ్మకు దేవస్థానం తరపున సారె తీసుకురావడం ఆనవాయితీ

//ఈవో త్రినాథరావు సహా ట్రస్టు బోర్డు సభ్యులంతా కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాం

//ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాం

//దుర్గమ్మ ఆలయంలో ఏర్పాట్లు బాగున్నాయి

Tags:    

Similar News