Live Updates: ఈరోజు (22 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-22 03:18 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 22 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | అష్టమి - 22:53:39 వరకు తదుపరి నవమి | ధనిశ్ఠ - 11:09:53 వరకు తదుపరి శతభిష | వర్జ్యం 14:50:57 నుండి 16:15:16 | అమృత ఘడియలు 11:39:51 నుండి 12:24:49 | దుర్ముహూర్తం 16:09:39 నుండి 16:54:37 | రాహుకాలం 16:15:16 నుండి 17:39:34 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-22 14:28 GMT

  కర్నూలు జిల్లా...

* సప్తనది సంఘమేశ్వర క్షేత్రం లో పుష్కర పూజల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న బి.జె.పి. రాష్ట్ర మహిళ నేత బైరెడ్డి శబరి అరెస్ట్.

* కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి భక్తులు పుష్కర స్నానం ఆచరించేలా రెచ్చగొడుతున్నారని అరెస్ట్.

* సంగమేశ్వరం - కపిలేశ్వరం మధ్య అటవీ ప్రాంతంలో అరెస్ట్ చేసిన ఆత్మకూరు పోలీసు.

* బైరెడ్డి శబరి అనుచరులకు పోలీసు బలగాల కు మధ్య ఉద్రిక్తత పరిస్థితులు.

* పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేత బైరెడ్డి శబరి.

* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హిందు సాంప్రదాయలను మంట గలుపుతున్నారని ఆరోపణ.

* సంవత్సరన్నార పరిపాలన లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపాటు. 

2020-11-22 13:52 GMT

  శ్రీకాకుళం

- ఆమదాలవలస మండలం లో దన్నానపేట గ్రామంలో సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన   సభాపతి తమ్మినేని సీతారాం

- ఇటీవల నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు అనంతరం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు..

స్పీకర్ గా నన్ను ఎన్నుకొని ఆ గౌరవాన్ని మన నియోజకవర్గానికి ఇచ్చారు

మారుమూల ఉన్న మన నియోజకవర్గానికి స్పీకర్ పదవి ఇచ్చి నియోజకవర్గ గౌరవాన్ని పెంచారు

బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పీకర్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో బీసీల అంటే బ్యాక్ బోన్ అని దేశానికి వెన్నుముక అని ఆయన అన్నారు

సంక్షేమం గ్రామాల అభివృద్ధి ద్యేయంగా సీఎం జగన్ గారు ముందుకు వెళుతున్నారని

అవినీతికి అందుబాటులో లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతుంది

అర్హత ప్రాధాన్యతగా జాతి కుల మత భేదాలు లేకుండా పథకాలని ముందుకు తీసుకువెళ్తున్నారు

2020-11-22 13:43 GMT

 గుంటూరు

* పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులపై రాళ్ళతో దాడి చేస్తున్న వైసిపి కార్యకర్తల పరిస్తితి ఉద్రిక్తం

* ప్రతివారం లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ

2020-11-22 13:24 GMT

కర్నూల్

 - పత్తికొండలో వైసీపీ నేత పోచమి రెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా కార్తీక దీపోత్సవం కార్యక్రమం

 - ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన విశాఖ శారదా విద్యా పీఠం ఉత్తరాధికారి సాత్మా నరేంద్ర సరస్వతి

- పెద్ద ఎత్తున తరలివచ్చిన పత్తికొండ వాసులు....

- తులసి వనానికి ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాల కు సంబంధించిన కిట్లు పంపిణీ చేసిన విశాఖ స్వామి సాత్మా నంద సరస్వతి

2020-11-22 13:22 GMT

 అమరావతి

 పవన్ కళ్యాణ్

-పోలీసులతో బాధితులపైనే కేసులు వేయించడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తోంది.

-శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ఇంటిపై ఓ యువకుడు దాడికి తెగబడటం అమానుషం

-ఆ ఇంటినీ, వారి వాహనాన్ని ధ్వంసం చేస్తే పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది.

-బాధితులైన వినుత కుటుంబంపైనే ఎదురు కేసు నమోదు చేయడం ఏమిటి

-పోలీసులపై అధికార వైసీపీ నేతల ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం అవుతోంది.

-చట్టప్రకారం పని చేయాల్సిన పోలీసులు వైసీపీ నాయకులు చెప్పిన విధంగా పని చేస్తే బాధితులకు న్యాయం ఎలా దొరుకుతుంది?

-వినుత కోటా కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

-అధికార పక్షం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

-అధికార పార్టీ అప్రజాస్వామిక పద్దతుల్లో వెళ్తూ గూండాయిజానికి పాల్పడుతుంది

-జనసేన మౌనంగా ఉండదు. కచ్చితంగా నిలదీసి ప్రశ్నిస్తుంది.

2020-11-22 13:19 GMT

  గుంటూరు...

- పెదవడ్లపూడి బుకింగ్ హామ్ కెనాల్ లో బట్టలు ఉతకటానికి వెళ్లిన నలుగురు మహిళలు కాలువలో ప్రమాదవశాత్తు మునక..

- ముగ్గురిని సురక్షితంగా బయటకు లాగిన స్థానికులు..

- పి. లావణ్య అనే మహిళ గల్లంతు..

2020-11-22 13:17 GMT

 కర్నూల్

-తుంగభద్ర పుష్కరాలు సందర్భంగా ఆదివారం మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని...

-విశాఖ శ్రీ శారదా పీఠం స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకుని పూజలు నిర్వహించారు.

-ప్రజలు కరోణతో ఇబ్బంది పడుతున్న సమయంలో తుంగభద్ర పుష్కరాలు రావడం భగవంతుని ఆశీస్సులే నన్నారు.

-తుంగభద్ర పుష్కరాలలో స్నానమాచరించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది

-భక్తాదులు అందరూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని పుణ్యస్నానాలు చేయాలన్నారు.

2020-11-22 13:14 GMT

 అమరావతి

- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు

- ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి

- ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డి

- ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఎస్‌బీఆర్ కుమార్

- ఈమేరకు ఉత్తర్వులు విడుదల చేసిన సియస్ నీలం సాహ్ని.

2020-11-22 13:12 GMT

  అనంతపురం:

- 3500 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం.

- 20 మంది అరెస్టు

- 97 లీటర్ల నాటు సారా, 77 టెట్రా పాకెట్లు పట్టివేత

2020-11-22 13:10 GMT

 అనంతపురం:

* పుట్టపర్తి ప్రశాంతి నిలయం పూర్ణ చంద్ర ఆడిటోరియం లో ఘనంగా ప్రారంభమైన సత్యసాయి ఇన్స్ ట్యూట్ ఆఫ్ హైయ్యర్ లర్నింగ్ 39వ స్నాతకోత్సం.

* విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను పంపిణీ చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్.

Tags:    

Similar News