Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-20 00:26 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 20 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి సా.04-40 వరకు తదుపరి పంచమి | అనూరాధ నక్షత్రం ఉ.09-37 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం: మ.02-55 నుంచి 04-25 వరకు | అమృత ఘడియలు మ.12-01 నుంచి 01-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి రా. 10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-20 16:28 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

-40 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 116.90 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 6.47 టీఎంసీ

-ఇన్ ఫ్లో 1,74,000 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 1,80,000 క్యూసెక్కులు

2020-10-20 16:17 GMT

- క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌

-గ‌త వారం రోజుల‌లో 65 శిథిల భ‌వ‌నాల కూల్చివేత‌

-వ‌ర్షాలు ప‌డుతున్నందున శిథిల భ‌వ‌నాలు ఖాళీ చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసిన క‌మిష‌న‌ర్‌

-వ‌ర్షాలు ప‌డుతున్నందున శిథిల భ‌వ‌నాలు ఖాళీ చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు క‌మిష‌న‌ర్‌ విజ్ఞ‌ప్తి

2020-10-20 16:13 GMT

సిద్దిపేటజిల్లా ...

-మిరుదొడ్డి లో ఎన్నికల ఇన్ఛార్జీలతో కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం .

-సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్,ఎంపీ రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ,మాజీ ఎంపీ రాజయ్య .లు

2020-10-20 16:10 GMT

*డీకే అరుణ...బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

-వాళ్ళ కుటుంబ సభ్యుల నియోజకవర్గలు దుబ్బాక కు పక్కనే ఉన్నాయి

-ఇక్కడ ఓటమి పాలయితె ఎలా అనే భయం హరీష్ రావు కు పట్టుకుంది

-బీజేపీ కార్యకర్తలను బయబ్రతులకు గురిచేస్తున్నారు

-టి ఆర్ ఎస్ బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు ఎవరు బయపడారు

-బీజేపీ కార్యకర్త వాహనాన్ని నిన్న అణువు అణువు చెక్ చేశారు

-వాహన ఇంజన్ పార్ట్స్ కూడా ఇప్పరు

-ఇలాంటి వేధింపులు నేను ఎక్కడ చూడలేదు

-కాంగ్రెస్,టి ఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాయి

-టి ఆర్ ఎస్ నేత ను కాంగ్రేస్ లోకి పంపించి టిక్కెట్ ఇప్పించారు

-దుబ్బాక ప్రజలు కాంగ్రెస్ టి ఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ను అర్ధం చేసుకుంటున్నారు

-దుబ్బాక ప్రజలు బీజేపీ ని గెల్పించడానికి సిద్ధమైన్నారు

-టి ఆర్ ఎస్ హయాంలో దుబ్బాక కు చేసింది ఏమి లేదు

-ఇప్పుడు దుబ్బాక కు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పుతున్నారు...

-మా బీజేపీ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతే హరీష్ రావు ఛాలెంజ్ చేస్తున్నారు

-మీరు ఇచ్చిన హామీల మీద కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు లు ఛాలెంజ్ కు రండి మేము సిద్ధంగా ఉన్నాం

2020-10-20 15:29 GMT

కామారెడ్డి జిల్లా..

-లింగంపేట్ మండలం బాణపూర్ తాండలో విషాదం

-మేకలు మేపడానికి అడవికి వెళ్లి అన్న, తమ్ముళ్ల మృతి

-అటవీ అధికారులు తవ్విన భూక్య జగన్ 10 తమ్ముడు భూక్య శివ 08 ఇద్దరు బాలురు మృతి

2020-10-20 15:12 GMT

  మంత్రి కేటీఆర్..

#ప్రభుత్వం అందిస్తున్న పదివేల తక్షణ అర్ధిక సహాయన్ని పలు కాలనీల్లోని ప్రజలకు అందించిన కేటీఆర్

# పలు కాలనీల్లో పర్యటించి పలు కుటుంబాల యోగక్షేమాలు కనుక్కోని, వారికి అర్ధిక సహాయం అదించిన కేటీఆర్

#వరద భాదితులు ఏంత మంది ఉంటే అంత మందకి సహాయం అందిస్తాం

# హైదరాబాద్, పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు ఈరోజు నుండి రు.10,000 చొప్పున రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆర్థిక సాయం అందజేస్తుందన్న మంత్రి

# ఇంటి వద్దకే వచ్చి అధికారులు సహాయం అందిస్తారన్న కేటీఆర్

# నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో.. ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ సమావేశం

# రానున్న పదిరోజులు ప్రజల్లోనే ఉండాలని సూచన

#సహాయక, రిస్టోరేషన్ చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని సూచన

#ముఖ్యమంత్రి పిలుపు మేరకు రెండు నెలల తమ వేతనాన్ని సిఎం ఆర్ఎఫ్ కు అందించేందుకు నగర టిఆర్ఎస్ ఎమ్మెల్యేలప, ఎమ్మెల్సీలు, ఎంపిల నిర్ణయం

2020-10-20 15:07 GMT

నిజామాబాద్..

-నిజామాబాద్ మండలం గూపన్ పల్లి లో దారుణం

-గూపన్ పల్లి చౌరస్తా లో ఇరువురి ఘర్షణ

-ఘర్షణ లో సయ్యద్ యూసుఫ్ అనే వ్యక్తి తలపై మందు బాటిల్ తో దాడి, అక్కడికక్కడే మృతి

-ఘర్షణ పడిన వ్యక్తులు పాత ఇనుప సామాను బండ్లను తోలే వారు

-అదే బండిలో ఉన్న మందు బాటిల్ తో దాడి చేసిన వ్యక్తి పరారి

-విచారణ జరుపుతున్న పోలీసులు

2020-10-20 14:31 GMT

సిద్దిపేట :

తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్ తో పాటు వంద మంది కాంగ్రెస్, బిజెపి నుండి మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరిక

హరీష్ కామెంట్స్ :

- పెద్ద వకీలును అని చెప్పి ముంపు గ్రామాల ప్రజలకు చెప్పి రెండు సంవత్సరాల దాక మళ్లీ కనిపించలేదు

- కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి కారనం కాంగ్రెస్ వాళ్లు కేసులు వేయడమే

- టిఆర్ఎస్ పార్టీ కి విశ్వాసం విశ్వతనీయత ఉంది

- కొండపోచమ్మ, రంగనాయక సాగర్ భూనిర్వాసితులకు ఎలా అందిందో మల్లన్నసాగర్ బాధితులకు కూడా అదేవిధంగా ఇస్తాం

- రైతులకు కరెంటు ఇవ్వక మోసం చేసినందుకు ఓట్లు అడుగుతరా కాంగ్రెస్ పార్టీ

- కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కోర్టులో కేసులు వేసినందుకు అడుగుతరా

- దుబ్బాక ను అన్ని విధాలా అభివృద్ధి చేసిండు రామలింగారెడ్డి

- వారి పాలనలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు కాంగ్రెస్

- హుజూర్ నగర్ లో ఓట్ల కోసం అక్కడి కి కెసిఆర్ పోలేదు కానీ గెలిచాక మూడు వందల కోట్ల అభివృద్ధి చేసిండు

- తెలంగాణ వచ్చాక మూడు ఉప ఎన్నికలు అయితే అన్నింటిలో భారీ మెజార్టీతో టిఆర్ఎస్ గెలిచినది.. దుబ్బాక కూడా అంతకు డబుల్ మెజారిటీ తో గెలుస్తాము

- టిఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను చెప్తుంది.. మీలాగ గ్లోబల్ ప్రచారం చేయము

- తొగటకు ఇంటడుగు జాగలో అవశరమున్నన్ని డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం

- తొగుట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం

- సోలిపేట సుజాత అక్కను బ్రహ్మాండమైన మెజారిటీ తో గెలిపిస్తాం

2020-10-20 09:51 GMT

hmtv తో టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ...

-తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడే ప్రజల కోసం ఒక ఛాలెంజ్ తో ఏర్పడింది...

-మరోసారి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన మా పార్టీ జాతీయ అధ్యక్షుడికి ధన్యవాదాలు...

-పార్టీ ఒక్కరి చేతిలో ఉండదు అందరూ కలిసి పనిచేస్తం...

-తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం...

-తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కలిసి కృషి చేస్తం..

-గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జరగాల్సినవి ఆరు నెలలు ముందుగానే వెళ్లారు...

-గత ఎన్నికల్లో మహాకూటమిగా వెళ్ళాము పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరగడం వల్ల భంగపడ్డాం...

-జిహెచ్ఎంసి, పట్టభద్ర ఎన్నికల్లో పోటీ చేస్తాం...

-ఊహించని విధంగా దుబ్బాక ఎమ్మెల్యే మరణించడం వల్ల ఉప ఎన్నికలు వచ్చాయి...

-ఇతర ఎన్నికల పైన దృష్టి పెట్టడం కోసమే దుబ్బాకలో పోటీ చేయలేదు..

-పట్టభద్రులు ఎన్నికల కోసం ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టాం...

-రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు రైతాంగం లక్షల ఎకరాల పంట ఇబ్బందులు పడుతుంది...

-రేపు జరిగే దీక్షలో ఎమ్మెల్యేలు తో పాటు నేను కూడా పాల్గొంటున్నారు...

-బూత్ స్థాయి నుంచి పార్టీ కేడర్ అభివృద్ధికి కృషి చేస్తాం నాయకత్వాన్ని పటిష్ట పరుస్తాం...

2020-10-20 09:39 GMT

సంగారెడ్డి..

జగ్గారెడ్డి ఎమ్మెల్యే .. 

-రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా

-అధికారులు ఉన్నారా లేరా

-వరదల్లో ప్రజలు ఎట్లా ఉన్నారు,పంట నష్టం వల్ల ప్రజలు ఎలా ఉన్నరో ప్రభుత్వం పట్టించుకోవడం

-పట్టణలో ఇండ్ల లోకి వచ్చే నీరును ఎత్తి పోసుకోవడానికే సరిపోతుంది.

-మా సంగారెడ్డి లో తిరుగుతుంటే కలెక్టర్ కు ఫోన్ చేస్తే రివ్యూ లో ఉన్నారు

-ఈ సమయంలో ధరణి మీద సమీక్ష అవసరమా

-వర్షాలకు ఇండ్లు దెబ్బతింటే ఇండ్లు కట్టిస్తా అన్నారు

-ఇప్పుడేమో 10వేలు,50 వేలు లక్ష రూపాలు ఇస్తా అంటున్నారు

-ఆ డబ్బులు ఎలా సరిపోతాయి

-5 లక్షల రూపాల ఇల్లు దెబ్బతింటే లక్ష ఇస్తే సరిపోతుందా

-550 కోట్లు సరిపోతాయా మరి రైతుల పరిస్థితి ఏమిటి

-నగరలో ఉండే ప్రజల పరిస్థితి ఏమిటి

-కేవలం ghmc ఎన్నికల కోసమే 550 కోట్లు విడుదల చేసారు తప్ప ప్రజల మీద ప్రేమ లేదు

-సీఎం,సీఎస్ వెంటనే రైతుల మీద రివ్యూ పెట్టాలి.

-ఆర్ధిక మంత్రి ప్రజల సమస్యలు చూస్తాడా

-దుబ్బాక కు పోయి లక్ష మెజార్టీ కావాలాంటరా

-హైదరాబాద్ కు 10వేల కోట్లు కావాలి

-రాష్ట్రవ్యాప్తంగా అందరిని అదుకోవాలంటే లక్ష కోట్లు కావాలి

-రైతులను,ప్రజలను అదుకోకపోతే రోడ్ల పైకి వచ్చి పోరాటం చేస్తాం

-ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ లు కూడా పూర్తి కాలేదు

-కాంట్రాక్టర్ల జేబులు నింపడానికె రి డిజెన్ చేస్తున్నారు

-ఎవరు దగ్గర డబ్బులు ఉన్నాయని విరాళాలు అడుతున్నావు కేసీఆర్

-తెలంగాణ కాంట్రాక్టర్లు దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు

-రైతులను ప్రజలను అదుకోకపోతె ప్రకృతే ప్రభుత్వానికి బుద్ధి చెప్పుతుంది

Tags:    

Similar News