Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
West godavari district updates: చింతలపూడిలో విషాదం!
పశ్చిమ గోదావరి జిల్లా..
-చింతలపూడిలోని మారుతీనగర్ లో పూరీధారవతి (30) అనే మహిళ హత్య,
-భర్త పై అనుమానం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ananthapur updates: అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసిన గుత్తి పోలీసులు...
అనంతపురం:
-గుత్తి పట్టణ శివారులలో గత నెల 29న మేలిమి బంగారాన్ని తక్కువ రేటుకు అమ్ముతాం అని ఓ వ్యక్తి ని మోసం చేసిన దుండగులు.
-అతడి నుంచి రూ. 5.10 లక్షలు లాక్కెళ్లిన దొంగలు.
-ఇరవై రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.
-ఆరుగురు అరెస్టు, రూ. 5.10 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం.
Ananthapur updates: ఎస్కేయూ ముందు ఏఐఎస్ ఎఫ్ ధర్నా...
అనంతపురం:
-డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్.
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన.
-కరోనా కాలం లో అన్ని పరీక్షల ను రద్దుచేసి విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్.
-ఆందోళన కారులను అరెస్టు చేసిన పోలీసులు
Nara Lokesh: ఏలేరు వరద ముంపులో ఉన్న ఈబిసి కాలనీ వాసులను పరామర్శించిన నారా లోకేష్.
తూర్పుగోదావరి :
-గొల్లప్రోలు ఈబిసి కాలనీకి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
నారా లోకేష్ కామెంట్స్..
-అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను ఎగతాళి చేస్తున్నారు..
-అధికారం లేదని అవహేళన చేస్తున్నారు.. నాకు మీ లాగా అహంకారం లేదు..
-రాష్ట్రంలో మూడు నెలలుగా వరద ఉంది.. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు..
-జిల్లాలో 1 లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది..
-రైతులను అపహాస్యం చేసి అవమానిస్తున్నారు.. వారు పండించేది తింటూ తిడుతున్నారు..
-ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు..
-వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో 64 మంది రైతుతు మృతి చెందారు.
-కౌలు రైతులందరికి రైతు భరోసా అన్నారు.. 15 లక్షల మంది ఉండగా కేవలం 54 వేల మందికి మాత్రమే ఇచ్చారు..
-రైతులకు కులాన్ని ఆపాదించారు.. అగ్ర వర్ణాల రైతులకు ఏ పధకం వర్తించడం లేదు..
-జగన్ రెడ్డి గారు ఆకాశం విహరించడం మానుకుని భూమి పైకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోండి..
-ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తుంటే మమ్మల్ని తిడుతున్నారు..
-వరద వస్తుందనఅ తెలిసినా స్పందించ లేదు.. ఫలితంగా ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..
-ప్రధాని మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితి పై ఆరా తీసే వరకు సిఎం స్పందించకపోవడం దారుణం..
-జనవరి నుంచి 25 లక్షల రూపాయిలు మాత్రమే ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం చెల్లించారు..
-రైతుల శాపం మంచిది కాదు జగన్ రెడ్డి.. ఇప్పటికైనా మేలుకోవాలి..ప్రతిపక్షంలో ఉండగా మమ్మల్ని ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇప్పడు 5 వందలు ఇస్తామంటున్నారు..
-మోటార్లకు మీటర్లు బిగిస్తే ఊరుకోం.. రైతుల పక్షాన టిడిపి పోరాటం చేస్తుంది..
-మా ప్రభుత్వంలో శుధ్ధగడ్డ వాగు ఆధుకనీకరణకు నిధులు ఇస్తే రివర్స్ టెండరింగ్, యు టర్న్ అని నిధులు నిలిపివేసి నిండా ముంచారు..
-మా ప్రభుత్వం లో పోలవరం పనులు 70 శాతం పూర్తయితే ఇప్పుడే కేవలం 2 శాతమే పూర్తయ్యాయి..
Amaravati updates: ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేసిన అరోగ్య శ్రీ ట్రస్ట్..
అమరావతి..
-ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నెట్వర్క్ ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేసిన అరోగ్య శ్రీ ట్రస్ట్
-కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు డబ్బులు కడితేనే చేర్చుకుంటాం అని ఉద్యోగులకు చెప్తున్నట్టు సమాచారం
-తర్వాత రీయింబర్స్మెంట్ పెట్టుకోవాలని ఉద్యోగులకు సూచిస్తున్న ఆసుపత్రులు
-ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఆరోగ్య శ్రీ ట్రస్ట్
-డబ్బులు తీసుకోవడం, క్యాష్ పేమెంట్ డిమాండ్ చేయడం లాంటివి చేస్తే చర్యలు
-రోగుల వద్ద తీసుకున్న డబ్బులకు 10 రెట్లు పెనాల్టీ వేస్తాం అని హెచ్చరిక
-అలాంటి ఆసుపత్రులను అన్నీ స్కీం ల నుండి మూడు నెలలు సస్పెండ్ చేయాలని నిర్ణయం
-ఇప్పటికే ఆసుపత్రుల బకాయిలు దాదాపు చెల్లించిన సర్కార్
-ఈ నెల 13 న నెట్వర్క్ ఆసుపత్రులకు రూ. 31 కోట్ల విడుదల చేసిన అరోగ్య శ్రీ ట్రస్ట్
-మరికొద్ది రోజుల్లో మరో 16 కోట్ల రూపాయల విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం
Amaravati updates: సచివాలయంలో మంత్రి మేకపాటి సమీక్షా సమావేశం..
అమరావతి..
-నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై సచివాలయంలో మంత్రి మేకపాటి సమీక్షా సమావేశం
-స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, యూనివర్శీటీల ఏర్పాటు పనులపై చర్చ
-20 స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి
-మరో 5 కాలేజీలకు కేటాయింపులో ప్రస్తుత పరిస్థితిపైనా మంత్రి ఆరా
-తొలుత పరిపాలన విభాగం నుంచి అనుమతులకు యత్నం
-తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాలో ముందు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల -ప్రారంభానికిసమాలోచనలు
నైపుణ్యవిశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన నిధుల సమీకరణపైనా చర్చ
వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న మంత్రి మేకపాటి ఛాంబర్ లో సమీక్ష
హాజరైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో, ఎండీ అర్జా శ్రీకాంత్ ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, తదితరులు
నవంబర్ 15 కల్లా సమగ్ర పరిశ్రమ సర్వే పూర్తి చేయాలని మంత్రి మేకపాటి ఆదేశం
విశాఖ
ఎఒబిలో మావోయిస్టుల కు పోలిసుల కు మధ్య కాల్పులు నేపథ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు వేట
చింతపల్లి అటవి ప్రాంతంలో కూంబిగ్ ముమ్మరం
ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు చనిపోవడంతో ఎఒబిలో విధ్వంసానికి పాల్పడే అవకాశాలు
దీంతో ఏజెన్సీలో ముంమ్మరంగా వాహనాతనిఖీలు చేస్తున్న చింతపల్లి పోలీసులు
కడప :
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్
తులసిరెడ్డి కామెంట్స్ ...
విభజించి పాలించు అన్న బ్రిటిష్ కుటిల నీతిని పాటిస్తున్న సిఎం వైఎస్ జగన్.
బీసీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర
బిసి కార్పొరేషన్లు నేతిబీరకాయలు
నేతి బీరకాయలో నెయ్యి ఉండదు బీసీ కార్పొరేషన్లో నిధులు ఉండవు.
బీసీల నిజమైన నేస్తం కాంగ్రెస్ ఒక్కటే
50 సంవత్సరాల క్రితమే బీసీలకు 25% రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్
26 సంవత్సరాల క్రితమే బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్
12 సంవత్సరాల క్రితమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్పులు కల్పించిన ఘనత కాంగ్రెస్ కు మాత్రమే ఉంది
విశాఖ శారదాపీఠంలో దసరా వేడుకలు
వైష్ణవీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న రాజశ్యామల అమ్మవారు
శంఖు చక్ర గదా సారంగములతో భక్తులకు అమ్మవారి అనుగ్రహం
పీఠాధిపతులు స్వరూపానందేంద్ర చేతులమీదుగా అమ్మవారికి అభిషేకం
లోకకల్యాణార్ధం చండీయాగం, శ్రీమత్ దేవీ భాగవత పారాయణం
విజయవాడ
దుర్గమ్మ మెడలో మరో హారం
కనకపుష్యరాగం హారాన్ని దుర్గమ్మకి అందించిన NRI
అట్లాంటా దేశానికి చెందిన భక్తుడు తాతినేని శ్రీనివాస్
40లక్షల విలువ చేసే కనకపుష్యరాగం హారం..