Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-19 01:32 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-19 15:51 GMT

మెదక్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో  45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యని  మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వెల్లడి 

2020-08-19 15:47 GMT

ఆదిలాబాద్ జిల్లాలో విజ్రుంబిస్తున్నా కరోనా..

ఒక్క రోజులో యాబై ఒక్కటి కేసులు నమోదు..

బాదితులను చికిత్స కోసం అసుపత్రికి తరలింపు

2020-08-19 15:46 GMT

నిర్మల్ బాసర బాలుని  మృత ‌దేహంపై కోత్తకోణం..

రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో బాలుని మృత‌దేహన్నీ  తండ్రి పడేశాడని నిర్థారణ..

సీసీ కెమెరాలలో రికార్డైనా  దృశ్యం 

అటోలో బాలుని   మృతదేహన్ని తండ్రికి తీసుకవచ్చి పడవేశాడని సీసీ కెమెరాలలో రికార్డు

సీసీ పుటేజీ ఆదారంగా విచారణ జరుపుతున్నా పోలీసులు..

హత్యనా లేదా జాండిస్ తో మరణించాడనే దానిపై విచారణ జరుపుతున్నా పోలీసులు

రేపు పోస్డుమాస్టరమ్ రిపోర్టు లో బయటపడనున్నా నిజాలు

2020-08-19 15:13 GMT

రంగారెడ్డి జిల్లా: కేశంపేట మండలంల కేంద్రంలో రాఘవేంద్ర రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 190 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎన్ ఫోర్స్ మెంట్,సివిల్ సప్ప్లై అధికారులకు అప్పగించిన పోలీసులు..

రైస్ మిల్లు యజమనిపై కేసు నమోదు. 

2020-08-19 15:07 GMT

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కాగజ్ నగర్ -5 రెబ్బన -1

2020-08-19 15:05 GMT

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల సాలిగామ్ ఇండ్లలోకి చేరిన వరదనీరు...

ఎర్రవాగు బ్యాక్ వాటర్ ఇండ్లలోకి చేరడంతో ఇబ్బందులు పడుతున్నా గ్రామస్తులు..

ఇరవై ఒకటి కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన పోలీసులు..

ఆ కుటుంబాలకు నిత్యవసర వస్తువులు సరపరా చేసిన పోలీసులు, రెవిన్యూ అదికారులు

2020-08-19 15:02 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

ప్రస్తుత సామర్థ్యం 94.40 మీటర్లు

పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

ప్రస్తుత సామర్థ్యం 3.804 టీఎంసీ

ఇన్ ఫ్లో 4,52,600 క్యూసెక్కులు

ఓట్ ఫ్లో 4,52,600 క్యూసెక్కులు

2020-08-19 15:00 GMT

కర్మన్‌ఘాట్‌కు చెందిన సమీప బంధువుని ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసిన చంపాపేట్‌ నాగార్జున కాలనీకి చెందిన శ్రీపురం పవన్‌...

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసిన పవన్‌ 

పెళ్ళి పేరుతో 2015 నుంచి ఆమెతో సన్నిహితంగా ఉన్న పవన్‌

2017 బెంగళూరుకు తీసుకువెళ్ళి మెడలో పసుపు కొమ్ము కట్టిన పవన్‌

అప్పట్లో హనీమూన్‌ పేరుతో మూడు రోజుల పాటు ఊటీ.

ఆపై తమ కుటుంబీకులు అంగీకరించట్లేదంటూ యువతిని మోసం చేసిన పవన్‌

సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

పవన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన అధికారులు

2020-08-19 14:56 GMT

మెదక్: పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన సాలమ్మ అనే మహిళ మూడు రోజుల క్రితం అదృశ్యం...

అదే గ్రామంలోని బండా రాళ్ళ మద్య అనుమానాస్పద స్థితిలో సాలమ్మ మృతదేహము లభ్యం

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మెదక్ పోలీసులు...

2020-08-19 14:50 GMT

హైదరాబాద్,నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్: 

నగరంలో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా ను అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

నలుగురు నిందితులు మచ్చేందర్ తో పాటు సంతోష్, రాజేష్,జయంత్ లనుండి నకిలీ టెన్త్ 13 మెమోలు, ఓ లాప్ టాప్, పోస్టల్ డిపార్ట్ మెంట్ కు చెందిన నకిలీ పత్రలు, స్టాంపు లు స్వాధీనం..

ఈ ముఠా ప్రధాన సూత్రధారి మచ్చేందర్ నుండి గతంలో జయంత్ అనే నిందితుడు నకిలీ సర్టిఫికెట్స్ ద్వారా పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం పొందాడు.

జయంత్ ను అరెస్టు చేసిన పోలీసులు..

నిందితులు పై ఐ పి సి 420, 466,468,471 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం గాంధీ నగర్ పోలీసులకు అప్పగించిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..

Tags:    

Similar News