Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-17 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 17 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి రా.11-29 వరకు తదుపరి విదియ | చిత్త నక్షత్రం మ.02-23 వరకు తదుపరి స్వాతి | వర్జ్యం: రా.07-35 నుంచి 09-05 వరకు | అమృత ఘడియలు ఉ.08-25 నుంచి 09-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-57 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.19-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-17 15:43 GMT

హైదరాబాద్..

-అంధకారంలో చర్లపల్లి

-చర్లపల్లిలో మొదలైన వాన.. విద్యుత్తు సరఫరా నిలిపివేత

-శంషాబాద్ లో ఉరుములతో కురుస్తున్న వర్షం

-మల్కాజిగిరిలో అరగంట నుంచి కురుస్తున్న వర్షం

-టోలిచౌకి - బృందావన్ కాలనీ, షేక్ పేట రోడ్డులో ట్రాఫిక్ జాం

-దిల్​సుఖ్​నగర్​లో పోటెత్తుతున్న వరద

-ముంపు కాలనీలలో భారీగా వరద నీరు

-హరిహర పురంలో పెరిగిన వరద ఉధృతి, 14  కాలనీలకు పొంచి ఉన్న ప్రమాదం

-మెహదీపట్నం, బయోడైవర్శిటీ, గచ్చిబౌలి రహదారిపై నెమ్మదించిన వాహనాలు

-రహదారులపై పలుచోట్ల నిలిచిన వరదనీరు

-గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, నార్సింగి, లంగర్ హౌడ్, నానల్ నగర్, మెహదీపట్నం మీదుగా వాహనాల దారిమళ్లింపు.

2020-10-17 15:38 GMT

హైదరాబాద్.. 

-వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ ని దృష్టిలో ఉంచుకుని దుర్గం చెరువు తీగల వంతెన తెరచిన ట్రాఫిక్ పోలీసులు.

-వంతెన పై వాహనాలు ఆపరాదని...

-ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచన.సాధారణ రోజుల్లో శని ఆదివారాల్లో వాహన రాకపోకలను నిలిపి వేసి, కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతి.

2020-10-17 15:34 GMT

హైదరాబాద్: పాతబస్తీ..

-రైల్వే బ్రిడ్జ్ మీద పడ్డ హోల్

-ఆరు ఇంచులు మధ్యలో బ్రిడ్జ్ పై పడ్డ హోల్..

-భారీ వర్షానికి కారణంగా హోల్ పడ్డాడు భావిస్తున్న రైల్వే అధికారులు

-రైల్ పట్టాలపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు

-వెంటనే అప్రమత్తమై రైల్వే అధికారులు

-రైళ్ల రాకపోకలు నిలిపివేసిన అధికారులు..

-బ్రిడ్జ్ పై వాహనాలను మళ్ళీస్తున్న అధికారులు

2020-10-17 15:28 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-35 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 97.40 మీటర్లు

-ఇన్ ఫ్లో 1,44,700 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 1,77,500 క్యూసెక్కులు

2020-10-17 15:24 GMT

హైదరాబాద్ లో రెయిన్ ఎఫెక్ట్..

-మళ్ళి పది సెంటీమీటర్ల మార్క్ ను దాటిన హైదరాబాద్ లో వర్షపాతం

-హయత్ నగర్ లో 10 cm, ఉప్పల్ లో 9.3 cm, సరూర్ నగర్ 9.2 cm, అబ్దుల్లా పూర్ మెట్ 9.1, నాగోల్ 9 cm ల అత్యధిక వర్షపాతం

2020-10-17 15:19 GMT

- పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ మీరుగా lakadikapul వెళ్లేదారిలో చెరువులను తలపిస్తున్న రహదారి.

- స్వల్పంగా ట్రాఫిక్కు అంతరాయం

- ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పంజాగుట్ట సైఫాబాద్ పోలీసులు.

2020-10-17 15:17 GMT

నల్గొండ :

-దేవరకొండ నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాల‌ ప్రారంభోత్సవం లో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...

-దేవరకొండ లో గ్రంధాలయం‌ భవనం‌,బస్టాండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో కలిసి ప్రారంభించిన గుత్తా..

2020-10-17 15:15 GMT

హైదరాబాద్.. 

-ఉప్పల్ , ఎల్బీనగర్ , ఘటికేసర్ , హాయథ్ నగర లల్లో కుండపోత వాన.

-ఉప్పల్ నుండి నార పల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్.

-వరంగల్ హైవే పై రోడ్డు పనులు జరుగుతుండటంతో భారీగా గుంతలు.

-ఎక్కడ కనిపించని ట్రాఫిక్ పోలీసులు.

-వాహనదారులు అవస్థలు.

-ఘటికేసర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే వాళ్ళు రంపల్లి దమ్మాయి గూడ మీదుగా తార్నాక నుండి నగరంలో కి వస్తే బెట్టర్.

2020-10-17 15:12 GMT

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

-కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లూరు పంప్ నీట మునిగిన ఘటన కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్షానికి నిదర్శనం...

-పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మొదటి పంపుహౌజ్ మొదట భావించినట్లు ఉపరితలంపై కాకుండా భూగర్భంలో నిర్మిస్తే కల్వకుర్తి ఎత్తిపోతల పంపు హౌజ్ ప్రమాదమని నిపుణులు హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో ఈ ప్రమాదానికి దారి తీసింది...

-పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం బ్లాస్టింగ్ కారణంగా ఎల్లూరు పంపు హౌజ్ నీట మునిగి, కల్వకుర్తి ఎత్తిపోతల కింద లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడడం పట్ల ఆందోళన కలిగిస్తుంది...

-ఘటనకు పూర్తిగా నిర్లక్షమే కారణమని, కాంట్రాక్టర్లు, అధికారులపై ప్రభుత్వ అజమాయిషీ ఏమైంది.....?

-రాష్ట్ర స్థాయి నీటిపారుదల ఉన్నతాధికారులు, ప్రబుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర వహించింది....?

-తక్షణమే ఘటనపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వర్గాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ..

-కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని విజ్ఞప్తి ...

2020-10-17 15:03 GMT

నిజమాబాద్:

-బోధన్ రూరల్ ప్రాంతాల్లో దేవునిఆలయాల్లో దొంగతనలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పట్టుకొని రిమాండ్ పంపిన పోలీసులు..

-వారి వద్ద నుండి 12 గ్రాముల బంగారం,35 తులాల వెండి రెండువేయిల్ రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రామారావు వెల్లడించారు...

Tags:    

Similar News