Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-17 01:15 GMT
Live Updates - Page 2
2020-10-17 08:15 GMT

అనంతపురం: లలిత కళా పరిషత్ లో రాష్ట్ర స్థాయి రైతు సదస్సు.

విద్యుత్ పంపుసెట్లకు మీటర్లు, నగదు బదిలీ రద్దు చేయాలని డిమాండ్.

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో సదస్సు

కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి వద్దే శోభనాద్రీశ్వర రావు. రైతు సంఘం నేతలు

2020-10-17 08:14 GMT

తూర్పుగోదావరి

ఏపీ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు నిరహార దీక్ష కు కూర్చున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మద్దతుగా వైసీపీ యువజన నాయకుడు గణేష్ ఆధ్వర్యంలో ప్రదర్శన

పేపరు మిల్లు గేటు ఎదుట రోడ్డు పై కూర్చుని ధర్నా చేస్తున్న గణేష్

2020-10-17 06:12 GMT

తూర్పుగోదావరి

రాజమండ్రి లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్...ప్రెస్మీట్స్ కామెంట్స్ ...

ప్రజాప్రతినిధులు పై వున్న కేసులు సత్వర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం మంచి నిర్ణయం

దీనిపై అభినందిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కు లేఖ రాశాను

పలుకుబడి వున్నంత కాలం ప్రజాప్రతినిధులు కేసులు దాచేవారు.. ఇప్పటికైనా విచారణకు సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది

ఇపుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసు ట్రయల్కు వస్తుంది

సిఎం కొడుకుగా జగన్ పై

సిఎం స్థాయిలో ముద్దాయి గా ట్రయల్ నడవబోతుంది

వర్చువల్ కోర్టులో కేసులు వాదించాలి

ఏపీ ప్రజాప్రతినిధులు కేసులు విచారణ లైవ్ టెలికాస్ట్ పెట్టండి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కు లేఖలో ఈ అంశం రాశాను..

లైవ్ టెలికాస్ట్ పెడితే అనేక మంది ఖర్చు భరించడానికి ముందుకు వస్తారు

కోర్టులో జరిగింది జరిగినట్లు చూపిస్తే ప్రజలలో కేసులపై అవగాహన వస్తుంది.

సిఎం గా సంజీవయ్య గారి సమయంలోనే న్యాయమూర్తులపై ఇలాగే ఒక లేఖ రాశారు..

జగన్ రాసిన లేఖ కొత్తదేమీ కాదు సంజీవయ్య గారి లెటర్ పై నాడు హోంమంత్రి కి రాశారు

సంజీవయ్య రాజీనామా చేసేవరకూ ఆ లేఖపై స్పందన లేదు

సంజీవయ్య రాసిన లేఖ దరిమిలా న్యాయమూర్తులు చంద్రారెడ్డి, సత్యనారాయణ రాజులను బదిలీలతో పాటు పదోన్నతులు వచ్చాయి

చీఫ్ జస్టీస్ కు రాసిన లేఖ

ప్రెస్మీట్ పెట్టి చెప్పించడం సరికాదు

ప్రజల వద్దకు ఈ అంశం వెళ్ళాలనే ఇలా చేసివుంటారు

రెడ్డి లాబీయింగ్ బలంగా వున్న సమయం కాబట్టే 1965లో ఆ న్యాయమూర్తుల విషయంలో అలా చేశారు

జడ్జిమెంట్లు విషయంలో న్యాయమూర్తుల ప్రమేయం వుంటుందని నేను విశ్వసించను

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్...

2020-10-17 06:11 GMT

విజయవాడ

దివ్య సోదరుడు, దినేష్

నా చెల్లి బాగా చదువుకుంది

ప్రేమిస్తే చంపేస్తారా

నేను ఢిల్లీ నుంచీ వచ్చి చూసే వరకూ నమ్మలేదు

వాడిని తక్షణం చంపేయాలి

నాకు న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉంది

తెలంగాణలో కెసీఆర్ చేసారు..

ఏపీలో‌ జగనన్న కూడా నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేయాలి

2020-10-17 06:10 GMT

గుంటూరు...

జీజీహెచ్ లో నాగేంద్రబాబుకు కొనసాగుతున్న చికిత్సలు

పొట్ట లోపల భాగాలకు

శస్త్రచికిత్సతో ఆగిన రక్తస్రావం

నాగేంద్ర బీపీ, పల్స్ సాధారణంగానే ఉన్నాయి:

అతని అన్నవాహిక, పేగులకు గాయాలయ్యాయి

వాటిని సరి చేస్తూ వైద్యులు ఆపరేషన్ చేశారు.

గాయాలతో

పోయిన రక్తాన్ని మళ్లీ రీప్లేస్ చేశాం

అతని పరిస్థితి సాదారణ స్దితి కి రావడానికి మూడు వారాలు పడుతుంది.

హెచ్ఎంటివితో జిజిహెచ్ సూపర్ డెంట్. ప్రభావతి

2020-10-17 06:10 GMT

కడప :

కడప నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటన...

బుగ్గవంక సుందరీకరణ లో భాగంగా పరివాహక ప్రాంతంలో ప్రొటెక్షన్ వాల్ కు ఇరువైపులా బిటి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన..

రోడ్డు నిర్మాణానికి 14.28 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం...

పాల్గొన్న కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి

2020-10-17 06:09 GMT

తూర్పుగోదావరి జిల్లా

హాసనాబాద్ లో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ను పరామర్శించిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.

బోస్ గారి సతీమణి పిల్లి సత్యనారాయణమ్మ మృతి బాధాకరం...

దైర్యంగా ఉండాలని పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారికి మంత్రి ఆళ్ల నాని ఓదార్పు..

2020-10-17 06:09 GMT

విజయవాడ

దివ్య తండ్రి

నా కూతురికి పదమూడు కత్తిపోట్లు పొడిచాడు

పోలీసులు విచారణలో మా ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి అడిగారు

నేను ఆ సమయంలో ఆఫీసుకు వెళ్ళానని చెప్పాను

నా కూతురు నిద్రపోతుంటే పొడిచాడు

నిద్రపోతూ ఉండడంతో ప్రతిఘటించ లేకపోయింది

వాడు రెండు చోట్ల చర్మం కోసుకున్నాడు

వాళ్ళ అన్నయ్య వాడిని ప్రేరేపించాడు

చంపేసినా ఫర్లేదు నేను మీడియాకి చెపుతానని వాడికి వాడి అన్న చెప్పి ఉంటాడు

మాకు న్యాయం చేయాలి

సీఎం జగన్ మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను

2020-10-17 05:07 GMT

విశాఖ...

వెదర్ అప్ డేట్

మధ్య బంగాళాఖాతంలో ఈనెల 19 నాటికి అల్పపీడనం ఏర్పడి మర్నాటికి బలపడుతుంది.

దీని ప్రభావంతో ఆది సోమ వారాల్లో కోస్తాంధ్ర ఒడిసాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు...

తెలంగాణలో చెదురుమదురుగా భారీ వర్షాలు..

నేడు రేపు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు..

రేపు తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములు పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం..

2020-10-17 05:07 GMT

అమరావతి

దివ్య తేజస్వి, నాగేంద్ర వ్యవహారంలో పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు

మార్చి 28న నాగేంద్రకు కాల్ చేసిన దివ్య

ఏప్రిల్ 2 చివరి సారి దివ్యకు కాల్ చేసిన నాగేంద్ర

2018 మార్చిలో మంగళగిరి పానకాల స్వామి దేవాలయానికి వెళ్లిన దివ్య, నాగేంద్ర

పానకాల స్వామి దేవాలయంలో ఇరువురికి వివాహం అయినట్లు ఎటువంటి వివరాలు నమోదు కానట్లు గుర్తించిన పోలీసులు.

తేజస్వి మెడలో నాగేంద్ర తాళి కట్టి ఇద్దరు ఫోటో దిగినట్లు గుర్తించిన పోలీసులు

దివ్యతేజస్వి, నాగేంద్ర మధ్యలో మూడవ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు.

మహిళ ఆచూకీ కోసం దివ్య చదువుకున్న విష్ణు కాలేజికి వెళ్లిన పోలీసుల బృందం.

మరోవైపు నాగేంద్ర,తేజస్వి కామన్ ఫ్రెండ్స్ ను విచారిస్తున్న పోలీసులు

హత్య కేసును విచారించేందుకు కేసును దిశా పోలీసు స్టేషన్ కు బదిలీ

Tags:    

Similar News