Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-17 01:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 17 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి రా.11-29 వరకు తదుపరి విదియ | చిత్త నక్షత్రం మ.02-23 వరకు తదుపరి స్వాతి | వర్జ్యం: రా.07-35 నుంచి 09-05 వరకు | అమృత ఘడియలు ఉ.08-25 నుంచి 09-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-57 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.19-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-17 16:10 GMT

అమరావతి..

- కె. కన్నబాబు, విపత్తుల శాఖ కమిషనర్

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం దీని ప్రభావంతో రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ భారీ వర్షాలు

-తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం

-శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

2020-10-17 16:01 GMT

విజయవాడ..

-కరోనా నేపథ్యంలో రాత్రి 8గంటల వరకు అమ్మవారి దర్శనముకి అనుమతి

-క్యూ లైన్ లోఉన్న భక్తుల వరకు దర్శనముకి అనుమతి

-మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి దర్శనం కి అనుమతి, రేపటి నుంచి యధావిధిగా ఉదయం 6గంటకు దర్శనము

-రేపు బలాత్రిపురసుందరి దేవిగా దర్శనము ఇవ్వనున్న దుర్గమ్మ

2020-10-17 15:57 GMT

అమరావతి..

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల ఆదుకునేందుకు వెంటనే రూ.2250 కోట్ల ఆర్థిక సహాయం చేయడంతో పాటు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో కోరిన ముఖ్యమంత్రి:

-కేంద్ర హోం మంత్రికి ముఖ్యమంత్రి రాసిన లేఖలో ముఖ్యాంశాలు:

-బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయి.

-ఒక్క 13వ తేదీనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అదే జిల్లాలోని కాట్రేనికోనలో 228.20 మి.మీ, తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో 204.02 మి.మీ వర్షం కురిసింది.

-ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పొటెత్తింది.

-దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల గత మూడు రోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు (సహాయ శిబిరాలకు) తరలించాము.

 -భారీ వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైంది.

-గత ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాలు కురవడం, ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది.

-వరసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయి. పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. విద్యుత్‌ ఉత్పత్తిపైనా వర్షాలు ప్రభావం చూపాయి.

-ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ కూడా నిల్చిపోయింది.

-వరద సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా పని చేసినప్పటికీ, 14 మంది చనిపోయారు.

-వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం జరిగింది.

-ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంది.

-పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టి, తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకు రావడం కోసం తక్షణమే ముందస్తుగా కనీసం రూ.1000 కోట్లు మంజూరు చేయాలి.

-అదే విధంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం వెంటనే కేంద్ర బృందాన్ని పంపించాలి.

-ఇప్పటికే కోవిడ్‌–19తో ఆర్థికంగా నష్టపోయి ఉన్న రాష్ట్రంలో, ఇప్పుడు ఈ వర్షాలు, వరదలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి.

-కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు మీ అండ, చేయూత ఎంతో అవసరమని విజ్ఞప్తి చేస్తున్నాను.

2020-10-17 15:50 GMT

తిరుపతి

-కరోనా తగ్గుముఖం పట్టడంతో టిటిడికి చెందిన విష్ణునివాసం కోవిడ్ చికిత్సా కేంద్రాన్ని మూసివేయాలని నిర్ణయం

-టిటిడి 2వ,3వ సత్రం కూడా తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం

-నేటి నుంచి విష్ణు నివాసంలో కోవిడ్ అడ్మిషన్లు నిలిపి వేస్తూ నిర్ణయం

2020-10-17 15:48 GMT

తిరుమల..

-వీణాపాణై సరస్వతీ దేవి అలంకారంలో హంస వాహనంపై కొలువు తీరిన మలయప్ప స్వామి

-రేపు ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్య‌పుపందిరి వాహ‌నం

2020-10-17 14:29 GMT

అమరావతి..

-వైసిపి సీనియర్ నేత సీ రామచంద్రయ్య

-దానికి కొన్ని సవరణలు చేసి పంపమని కేంద్ర ప్రభుత్వం కోరడం అసాధారణం ఏమీ కాదు.

-ఐతే, ఇదేదో జగన్మోహన రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పులా తెలుగుదేశం నాయకులు మాట్లాడడం వారి అజ్ఞానానికి నిదర్శనం

-చరిత్ర తెలుసుకోకుండా టీడీపీ నేతలు మాట్లాడితే అవి వారికే ఎదురు కొడతాయి.

-ప్రజల్లో అభాసుపాలవుతారు.

-గతంలో తెలుగు దేశం అధికారంలో వుండగా ఇలాంటివి చాలా జరిగాయి .

-ఎస్సీ వర్గీకరణ పై తెచ్చిన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదం పొందక ముందే... రాజకీయ లబ్ది కోసం ఏడాది పాటు దానిని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది.

2020-10-17 13:09 GMT

విజయవాడ..

-తమ బిడ్డ హత్యకు సరైన న్యాయం జరగాలంటున్న దివ్య తలిదండ్రులు

-తక్షణమే న్యాయం జరగాలి అంటూ ర్యాలీ నిర్వహించిన దివ్య తలిదండ్రులు

-ర్యాలీలో పాల్గొన్న బంధువులు, చుట్టుపక్కల వారూ

-తమ ఇంటి వద్ద నుంచీ ఆర్సీఎం చర్చి వరకూ ర్యాలీ నిర్వహించిన దివ్య తలిదండ్రులు

-మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా చూడాలని కోరిన దివ్య తలిదండ్రులు

-ర్యాలీలో పాల్గొన్న మహిళా సంఘాలు

2020-10-17 13:07 GMT

విజయవాడ..

-భవానిపురం నుండి బస్టాండ్ వైపు వెళ్లే వైపు ట్రాఫిక్ జామ్

-అర కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు

2020-10-17 13:03 GMT

తూర్పుగోదావరి : కాకినాడ..

-సామాజిక మాద్యమాల్లో అసత్యాలను ప్రచారం చేస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన మలికిపురం పోలీసులు..

-జిల్లా ఎస్పీ నయీం అస్మీ మీడియా సమావేశం కామెంట్స్..

-ఈ నెల 15 న రాత్రి 11. గం.లకు మలికిపురం మం. సత్తెమ్మతల్లి గుడి మెట్లు, రైలింగ్ ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేసినట్టు అడబాల రామారావు వీడియో చిత్రీకరించాడు..

-అడబాల రామారావు కు వీడియో తీయడంలో సహకరించి.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన అడబాల దోరాజీ, ఎనుముల శ్రీనివాస్, బొరుసు తారకప్రభులను అరెస్ట్ చేశాము..

-లారీ ఢీ కొట్టడంతో విరిగిన సత్తెమ్మతల్లి ఆలయం మెట్లు, రైలింగ్ లను తమ కళ్ల ముందే ఎవరో ధ్వంసం చేశారని నిందితులు అసత్య ప్రచారం చేసారు..

-అసత్యాలను ప్రచారం చేసి కుల మత విధ్వేషాలు రెచ్చగొడితే ఉపేక్షించేది లేదు.. కఠిన చర్యలు తప్పవు..

2020-10-17 08:15 GMT

విజయవాడ

దివ్య హత్య కేసులో పురోగతి

దివ్య కుటుంబీకులను పరామర్శించనున్న హోంమంత్రి సుచరిత

మధ్యాహ్నం 2:30 లకు దివ్య ఇంటికి రానున్న హోంమంత్రి

Tags:    

Similar News