Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-16 01:35 GMT
Live Updates - Page 2
2020-09-16 08:39 GMT

Guntur updates: అమ్మవడి కార్యక్రమం ద్వారా పదమూడు లక్షల మంది మహిళలు లబ్ది పొందారు..హోం మంత్రి సుచరిత..

గుంటూరు...

హోం మంత్రి సుచరిత కామెంట్స్...

-కరోనా తో ఇబ్బందులు పడుతున్నా 14 వందల కోట్ల రూపాయలు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చారు.

-హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నెరవేర్చుతున్నారు.

-అరవై ఐదు వేల కోట్లను రూపాయలను ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చింది.

-రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి అయితే దానిని అభివృద్ధి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్.

-గత ప్రభుత్వన్ని నమ్మి డ్వాక్రా మహిళలు మోసపోయారు.

-ప్రతీ కుటుంబంలో లబ్ది పొందిన వాళ్ళు ఉన్నారు...వాళ్ళంతా ముఖ్యమంత్రి కి అండగా ఉంటారు.

2020-09-16 08:13 GMT

Srikakulam updates: జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి..

శ్రీకాకుళం జిల్లా..

-జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి..

-కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష, టిడిపి నాయకులు..

-కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలుగుదేశం నేతలు..

2020-09-16 08:10 GMT

Botcha Satyanarayana Comments: వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ..

బొత్స కామెంట్స్..

- పరీక్షల నిర్వహణలో 77,558 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

- పరీక్షా కేంద్రాలకు ఆర్టీసి నుంచి బస్సులను నడపాలి

- ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్ కూడా అందుబాటులో వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

- కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ 19 నిబంధనల ప్రకారం భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలి.

- పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద ధర్మల్ స్కానర్ తప్పనిసరి

- జిల్లా కలెక్టర్లు, జెసిలు, ఎస్పీలు పరీక్షలు సజావుగా జరిగేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలి

- గత ఏడాది ఏ రకంగా పకడ్భందీగా పరీక్షలు నిర్వహించారో, అదే విధంగా ఎటువంటి ఆరోపణలకు అవకాశం లేకుండా పరీక్షలు జరగాలి.

2020-09-16 08:00 GMT

Vizianagaram updates: విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం..

విజయనగరం..

-అరకు నుంచి ఒడిశా రాష్ట్రం రాయఘడ కు అక్రమంగా తరలిపోతున్న గంజాయిని పట్టుకున్న కొమరాడ పోలీసులు

-పార్వతీపురం వైపు నుంచి రాయఘడ రోడ్డులో లారీలో తరలిపోతున్న గంజాయి

-కొమరాడ వద్ద రహదారి గోతుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో లారీలో గంజాయిని గుర్తించిన పోలీసులు

-సుమారు కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

2020-09-16 07:57 GMT

Amaravati updates: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్..

అమరావతి..

పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..

-తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్‌ల భర్తీపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పెద్దిరెడ్డి     రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్

- వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్           కమిషనర్ విజయ్ కుమార్, తదితరులు

- కోవిడ్ నేపథ్యంలో సచివాలయ పోస్ట్‌ల భర్తీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

- 16,208 ఖాళీ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి.

- మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం.

- 20వ తేదీన 6,81,664 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.

- మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలు...

- మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం.

- కరోనా పాజిటీవ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన రూంలను సిద్దం చేశాం.

- పిపిఇ కిట్‌లతో ఐసోలేషన్ రూంలో ఇన్విజిలేషన్

2020-09-16 07:46 GMT

Vijayawada updates: మంత్రి వెల్లంపల్లిని భర్తరఫ్ చేయాలి..దేవినేని ఉమామహేశ్వరరావు..

విజయవాడ..

దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి..

-ఈవో బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు.

-సింహాలు పోయాయి అని క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు.

-Ias స్థాయి అధికారిని మార్చి ఎందుకు కింద స్థాయి అధికారిని ఈవో గా తీసుకువొచ్చారు.

-వెంటనే ఈవో ని సస్పెండ్ చేసి ఒక పూర్తి స్థాయి జ్యూడిషల్ దర్యాప్తు చేయాలి.

-ఈ 16 నెలల్లో జరిగిన అన్ని ఘటనలను అన్ని సీబీఐ చేస్తా విచారణ చేపించాలి.

-దేవాలయాలు, చర్చ, మసీదులు పై దాడులను టీడీపీ తీవ్రంగా కండిస్తుంది.

-24 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకూ పోలీస్ కేస్ పెట్టలేదు.

-భక్తుల మనోభావాలు కాపాడాల్సిన భద్యత మంత్రికి, ప్రభుత్వానికి లేదా ?

-ఈ ఘటనల పై వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి.

-నిందితులను కాపాడాలనే ప్రయత్నం ఇక్కడ అధికారులు, మంత్రి చేస్తున్నారు.

-రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాలలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది.

2020-09-16 07:34 GMT

Amaravati updates: కోడెల శివప్రసాదరావు ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులు.. నారా చంద్రబాబు నాయుడు..

అమరావతి..

-టీడీపీ జాతీయ అధ్యక్షులు, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు..

-డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారు.

-రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారు.

-36ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాదరావు గారు.

-అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు. 

-కోడెల ప్రజాసేవ గురించి కోటప్పకొండ ఆలయం చెబుతుంది.

-స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమాలు ఆయన పట్టుదలకు నిదర్శనం.

-అవయవదాన కార్యక్రమాన్ని సామూహిక కార్యక్రమం చేసిన ఘనత కోడెలది.

-ఏపీ శాసనసభ తొలి సభాపతిగా ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శనీయం.

2020-09-16 07:30 GMT

Vijayawada updates: విజయవాడ రూరల్ నిడమానురు సాయి బాబా గుడి వద్ద ఉద్రిక్తత.....

కృష్ణాజిల్లా:

-బీజేపీ, జనసేన పార్టీ నాయకులు గుడివద్ద నిరసన తెలియజేస్తుంటే వారిపై దాడికి దిగిన స్థానిక వైసీపీ నాయకులు, గ్రామస్తులు

-మా గ్రామంలో సమస్య పరిష్కారం చేసుకుంటాం మీరు ఈ విషయాన్ని ఎక్కువ చేయకండి అని బాహా బాహి కి దిగిన స్థానిక వై.సి.పి.నాయకులు.

-రంగంలోకి దిగిన పోలీసులు,ఇరు వర్గాల కు సర్ది చెప్పిన పోలీసులు

2020-09-16 07:26 GMT

Antarvedi updates: అంతర్వేది మీద దుర్మార్గం చేసిన వారిపై చర్యలు లేవు..విశ్వహిందూ పరిషత్, రవి..

విశ్వహిందూ పరిషత్, రవి..

-రాజమండ్రిలో వినాయక విగ్రహం, దుర్గాదేవి మందిరంలో సింహాల అపహరణ, శ్రీకాళహస్తిలో ఆలయ పవిత్రతకు భంగం

-హిందూ దేవాలయాలపై అపచారం విషయంలో అఖిలపక్ష సమావేశం వేయాలి

-హిందూ ధర్మ ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి

-అంతర్వేదిలో కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

2020-09-16 07:24 GMT

Vijayawada updates: అంతర్వేది అంశంపై ఉవ్వెత్తున అందరూ ప్రజలూ వెళ్ళారు..సోము వీర్రాజు..

విజయవాడ..

బీజెపి ఏపీ ఛీఫ్, సోము వీర్రాజు..

-జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ శ్రీకాకుళం, ప్రకాశం, అంతర్వేది అంశాలపై చర్యలు తీసుకోలేదు

-హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పవిత్రతపై అనుమానం ఉంది

-41 మంది యువకులపై కేసులు పెట్టారు

-చర్చి మీద రాళ్ళు వేసిన దుండగులు పారిపోయారు

-అంతర్వేది అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువకులను అరెస్టు చేసారు

-ప్రభుత్వం హిందూత్వం పై వ్యతిరేకత చూపిస్తుండడంపై బీజెపీ ఉద్యమం

-ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం

-గవర్నర్ ద్వారా ఈ అంశంపై ఒత్తిడి తెచ్చేలా మాట్లాడాము

Tags:    

Similar News