Live Updates: ఈరోజు (10 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-10 02:44 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 10 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | దశమి: రా.10-29 తదుపరి ఏకాదశి | పుబ్బ నక్షత్రం రా.2-50 తదుపరి ఉత్తర | వర్జ్యం: ఉ.11-40 నుంచి 1-11 వరకు | అమృత ఘడియలు రా.8-46 నుంచి 10-17 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-23

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-10 14:40 GMT

నిజామాబాద్... 

// మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న వీర జవాన్ ర్యాడ మహేష్ పార్థివదేహం...

// స్వస్థలానికి తరలించేందుకు అంబులెన్స్ ను సిద్ధం చేసిన ఆర్మీ అధికారులు.‌‌...

2020-11-10 14:26 GMT

మనిక్కం ఠాగూర్ ..టీపీసీసీ ఇంచార్జ్.

-దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎజెండా కోసం సైనికుల్ల పని చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు.

-భవిష్యత్తులో రెట్టింపు ఉత్సహంతో పనిచేద్దాం.

-గెలిచిన వాళ్ళు ఫేక్ న్యూస్ , డబ్బులు పంపిణీ చేసి గెలిచారు.

-దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి టీం వర్క్ చేశారు.

-దీపావళి తరువాత దుబ్బాక ఎన్నికల ఓటమికి కారణాల పై చర్చించుకుందాం.

2020-11-10 13:03 GMT

-దుబ్బాకలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారికి, బి.జె.పి. తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి శుభాబినందనలు

-బి.జె.పి., ఆ పార్టీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ విజయం నిదర్శనం

-పార్టీలోని అన్ని వర్గాలను సమాయత్తం చేసి ఈ విజయాన్ని సాధించారు.

-రఘునందన్ రావు గారి వ్యక్తిత్వం, ప్రజా సేవలో చూపే నిబద్దత ఆయనకు విజయ హారాన్ని అందించింది.

-రాజకీయాలను సక్రమ మార్గంలో నడిపించడం యువత వల్లే సాధ్యమవుతుందని నేను విశ్వసిస్తాను.

-ఈ ఎన్నికలో యువకులు విశేష సంఖ్యలో పాల్గొనడం ఒక శుభపరిణామం.

-దుబ్బాక విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున అభినందనలు - పవన్ కళ్యాణ్..

2020-11-10 12:22 GMT

   దుబ్బాక.. 

- మంత్రి హరీష్ రావు...

- ప్రజా తీర్పును శిరసా వహిస్తాం.. ఉప ఎన్నిక ఓటమి కి బాధ్యత వహిస్తున్నా..

- టి ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు..

- ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు..

- దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటాం.. మా లోపాలను సవరించు కుంటాం..

- దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటు పడతాం అందుబాటులో ఉంటాం..

- ఓటమి అయినప్పటికీ దుబ్బాక ప్రజల పక్షాన టి ఆర్ ఎస్ పార్టీ పక్షాన, నా పక్షాన కష్ట సుఖాల్లో ఉంటాం..

- సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కి , ప్రజలకు , కార్యకర్తలకు , అన్నివిధాల సహాయ సహకారాలు ఇస్తూ , టి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు     కృషి చేస్తోంది.

2020-11-10 12:18 GMT

-కె.కృష్ణ సాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి,తెలంగాణ రాష్ట్రం.

-పార్టీలో నా మిత్రుడు, నా సహచర నాయకుడు, మాజీ పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించినందుకు గాను నా   హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

-దుబ్బాక ఎన్నికల్లో మా పార్టీకి మద్దతు ఇచ్చిన దుబ్బాక ప్రజలందరికీ,ఓటర్లకు బీజేపీ ధన్యవాదాలు చెప్తుంది.

-ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన బీజేపీకార్యకర్తలకు ,నాయకులకు పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది.

-తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకి ఈ ఎన్నిక ఒక ఉదాహరణ,ఒక గుర్తుగా నిలవనుంది.

2020-11-10 04:42 GMT

దుబ్బాక..

-రెండో రౌండ్ లో బీజేపీ 3284

-రెండు రౌండ్ లు ముగిసే సమయానికి బీజేపీ 1128 ఆధిక్యం

2020-11-10 03:38 GMT

 హైదరాబాద్.. 

- ఈ రోజు హైదరాబాద్ లో వ్యర్థాల నుంచి పవర్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ప్రారంభం

- దక్షిణ భారతదేశంలోనే మొదటిసారి గా హైదరాబాద్ లో ఏర్పాటు అయిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్

-జవహర్ నగర్ లో ప్లాంట్ ను ప్రారంభం చేయనున్న మంత్రి కేటీఆర్

2020-11-10 03:30 GMT

సిద్దిపేట:

...ప్రారంభమైన ఈవిఎం ల లెక్కింపు

.....మొదట దుబ్బాక మండలానికి చెందిన ఈవిఎం ల లెక్కింపు..

.... మొదటి మూడు రౌండ్ లలో దుబ్బాక మండలానికి చెందిన ఈవిఎం ల ను లెక్కించనునలన్నారు

2020-11-10 03:28 GMT

సిద్దిపేట:

... పార్టీ ల కౌంటింగ్ ఏజెంట్లు, కలెక్టర్ భారతి హోలికెరీ, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సమక్షంలో ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసిన ఎన్నికల     అధికారులు

.....ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసే ప్రక్రియ కు హాజరైన బీజేపీ అభ్యర్ధి రఘునంధన్ రావు, హాజరు కానీ టీఆరెస్, కాంగ్రెస్ అభ్యర్థులు..

.... టీఆరెస్, కాంగ్రెస్ కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసిన అధికారులు

2020-11-10 03:07 GMT

యాదాద్రి భువనగిరి :

- ఇవాళ యాదాద్రి లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి,విప్ గొంగిడి సునీత ల పర్యటన...

- యాదాద్రి టెంపుల్ వర్క్స్ తో పాటు ఆధునిక బస్టాండ్ ,కారు పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించనున్న మంత్రులు....

Tags:    

Similar News