Live Updates:ఈరోజు (ఆగస్ట్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-08 23:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 09 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం షష్టి(మ. 4-36 వరకు) తదుపరి సప్తమి; రేవతి నక్షత్రం (ఉ. 8-23 వరకు), అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-08-09 17:00 GMT

- విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

- విచారణకు జేసీ(అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ నేతృత్వంలో కమిటీని నియమించారు.

- ఈ కమిటీలో సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జి.గీతాబాయి, ఆర్‌ఎఫ్‌వో ఉదయ్‌కుమార్‌, విద్యుత్‌ డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు.

- ప్రమాద కారణాలు, భద్రతా నిబంధనలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

- ఆస్పత్రుల నిర్వహణ లోపాలు, అధిక ఫీజుల వసూలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

- రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పాలనాధికారి కమిటీని ఆదేశించారు.

2020-08-09 15:44 GMT

 చెన్నై, పోర్టు బ్లెయిర్ మధ్య సముద్రంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 

- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

- అనంత‌రం ఈ ప్రాజెక్టును  జాతికి అంకితం చేస్తారు.

- ఈ ప్రాజెక్టుకు  2018 డిసెంబర్ 30న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

 

2020-08-09 12:28 GMT

కర్నూలు జిల్లా: 

- శ్రీశైలంలో కరోనా విజ్రంభిస్తుడంతో మరో 5 రోజుల పాటు శ్రీశైలంలో భక్తుల దర్శనాల నిలిపివేతను పొడిగించిన ఈవో కేఎస్ రామారావు.

- శ్రీశైల క్షేత్ర పరిధిలో లో కరోనా కేసులు విస్తరించడంతో గత నెల 15 నుండి ఇప్పటి వరకు పొడిగిస్తూ వస్తున్నా భక్తుల దర్శనాల నిలిపివేత

- యధావిధిగా స్వామి అమ్మవార్ల నిత్యకైంకర్యాల పూజల నిర్వహణ

2020-08-09 11:10 GMT

జాతీయం:

- కేరళలోని ఇడుక్కి జిల్లాలో తేయాకు కార్మికుల ఇళ్ళపై కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో య 42 కు చేరినమృతుల సంఖ్య

- పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఎన్డీఆర్‌ఎఫ్‌కి చెందిన రెండు బృందాలతో కలిసి ఆ ప్రాంతమంతా గాలింపు.

- గాలింపు చర్యలలో భాగంగా నేడు 16 మృతదేహాలు లభ్యం

- రక్షణ చర్యలకు భారీగా కురుస్తోన్న వర్షాలు ఆటంకం. జిల్లా అధికారుల అంచనా ప్రకారం ఇంకా 30 మంది కనిపించకుండా పోయారు.

2020-08-09 09:23 GMT

విజయవాడ: అగ్నిప్రమాదం ఘటన కలచి వేసింది..

ఇది‌ చాలా బాధాకరం

కోవిడ్ సెంటర్లుగా మారిన హోటల్స్ ను తనిఖీ చేయాలి

భద్రత చర్యలను తనిఖీ చేసి.. ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి

NDRF బృందంతో మాట్లాడిన సోము వీర్రాజు

మంటల్లో చిక్కుకున్న కరోనా రోగులను రక్షించిన సిబ్బందికి అభినందనలు

Ndrf సిబ్బంది సేవలను కేంద్రం దృష్టి కి తీసుకెళతా

2020-08-09 08:14 GMT

- కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కరోనా నెగెటివ్ అని తేలింది.

- ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ సిన్హా ఆదివారం ట్వీట్ చేశారు.

- కొన్ని రోజుల క్రితం అమిత్‌షాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన మేదాంత ఆస్పత్రిలో చేరారు.

- అమిత్‌షాకు కరోనా నెగెటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.

- త్వరలోనే షా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 

2020-08-09 07:02 GMT

విజయవాడ: స్వర్ణ ప్యాలస్ ప్రమాద స్థలాని పరిశీలిస్తున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ,హోం మంత్రి మేకతోటి సూచరిత,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని,దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర అధికారులు

2020-08-09 02:32 GMT

విశాఖ..

- సింహాచలం లో గతంలో ఈఈ గా పని చేసిన మల్లేశ్వరరావు దేవస్థానం భూములలో ప్రవైటు సంస్థలు కు లీజు కేటాయింపులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఈ..

- లీజు వ్యవహారాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు...

- ప్రస్తుతం సింహాచలం నుండి బదిలీ పై వెళ్ళిన మల్లేశ్వరరావు క్రిష్ణ జిల్లా పెనుగ్రంచిపోలు తిరుపతమ్మ దేవస్థానం లో ఈఈ గా విధులు నిర్వహిస్తున్నారు...

- మల్లేశ్వరరావు మీద ఆరోపణల పై విచారణ చేసిన అధికారులు సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసారు.

2020-08-09 02:31 GMT

కర్నూలు జిల్లా

- ఇన్ ఫ్లో : 2,17,109 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో : 42,000 క్యూసెక్కులు

- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

- ప్రస్తుతం : 853.00 అడుగులు

- నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు

- ప్రస్తుతం : 86.8390 టిఎంసీలు

- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

2020-08-09 02:00 GMT

తూర్పుగోదావరి -రాజమండ్రి

అన్నవరం దేవస్థానంలో కరోనా విజృంభన

- ఈనెల మొదటి వారం వరకూ

- ఒక కేసులేకున్నా ఉద్యోగులకు ,పురోహితులకు కలిపి ఇపుడు 49 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

- అప్రమత్తమై 300 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించిన దేవస్థానం

- నేటి నుంచి ఈనెల 14వ తేదీ ఆలయం మూసివేతకు నిర్ణయం

- కరోనా వల్ల సత్యదేవుని దర్శనాలు నిలుపుదల చేస్తున్నందున భక్తులెవ్వరూ రావొద్దని ఈవో త్రినాధరావు విజ్ఞప్తి

- శ్రావణమాసం, వివాహ ముహూర్తాల నేపథ్యంలో పెరిగిన భక్తుల రద్దీతో వారం వ్యవధిలోనే వెలుగుచూసిన కరోనా పాజిటీవ్ కేసులు

- అన్నవరం గ్రామంలో వంద దాటిన కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య

Tags:    

Similar News