Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-07 01:13 GMT
Live Updates - Page 2
2020-08-07 11:27 GMT

అసెంబ్లీ మీడియా పాయింట్: కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ

- 2014వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాయలసీమకు నీళ్లు తరలించుకు పోతుంటే మాట్లాడలేదు

- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది.

- తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేయాలని కేంద్రానికి లేఖ రాసాము

- కానీ కేంద్రం స్పందించలేదు, ట్రిబ్యునల్ కు డైరెక్షన్ ఇవ్వలేదు.

- ఎస్ఎల్పీ, డబ్ల్యుపి కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.

- పెండింగులో ఉండగానే పోతిరెడ్డిపాడు ద్వారా అదనపు నీటిని తరలించేందుకు ఏపీ జీవో ఇచ్చింది.

- ఏపీ తెచ్చిన జీవోల వల్ల తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని కోర్టులో కేసు వేశాము.

- కానీ ఏపీ తో పంచాయితీ అయితే కర్ణాటక మీద కేసు వేశారని తప్పుదారి పట్టిస్తున్నారు.

- కాంగ్రెస్ నేతలు కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.

- కాంగ్రెస్ చేసిన పాపాలను మేము కడిగే ప్రయత్నం చేస్తున్నాము.

- కేసీఆర్ చిత్తశుద్ధి ని శంకించే అధికారం కాంగ్రెస్ కు లేదు.

2020-08-07 11:15 GMT

కోవిడ్ పరిస్థితుల్లో సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం

మెగాస్టార్ చిరంజీవి:

- రక్త దానం నుండి ఫ్లాస్మా దానం వరకు సైబరాబాద్ పోలుసులు చేస్తున్న సేవను గుర్తించుకోవాలి

- ఇలాంటి మంచి మార్గం లో నన్ను నడిపిస్తున్నందుకు సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు

- 22 ఏళ్ల క్రితం నాకు సామాజిక బాధ్యత తెలియని సమయంలో

- ఓ న్యూస్ పేపర్ లో ఒక వార్తా చూసి చలించి పోయాను

- ఆక్సిడెంట్ లో ఎంతో మంది మృతి చెందడం , రక్తం దొరక మృతి చెందుతున్నారు అని గమనించి

- నేను బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భావించి ఏర్పాటు చేశాము

- దీనికి అభిమానులు సహకరిస్తూ , నిత్యం బ్లడ్ దానం చేస్తూ ముందుకు సాగుతున్నాం

- మాకు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు ఇచ్చింది

- ఈ కోవిడ్ పరిస్థితిల్లో ఇప్పుడు అసలైన ఆయుధం ఫ్లాస్మా

- ఈ ఫ్లాస్మా దానం చేయడం తో మరో ప్రాణాన్ని కాపాడిన వారు అవుతాము

- రెండు రోజులు క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది

- వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు అనే వ్యక్తి ని ఫ్లాస్మా దానం చేయమని చెప్పాను

- అతను దానం చేయడం తోనే మా బందువు ప్రాణాలతో బయట పడ్డాడు

- ఈ ఫ్లాస్మా దానం పై ఎవరు అపోహలకు పోవద్దు

- మీరు ఫ్లాస్మా దానం చేయడం ద్వారా ఎలాంటి బ్లడ్ లాస్ జరగదు

2020-08-07 11:13 GMT

గోరంట్ల లో మహిళ వాలెంటీర్ కు వేదింపులు.

గుంటూరు:

- గోరంట్ల లో మహిళ వాలెంటీర్ కు వేదింపులు.

- ధృవీకరణ పత్రం ఆలస్యం పై ప్రశ్నించిన వాలెంటీర్

- అసభ్యంగా దూషించిన

- సచివాలయ ఉద్యోగి , తోటి వాలెంటీర్.

- తన పైన జరిగిన అసభ్య దూషణ పై ప్రశ్నించిన వాలెంటీర్ భర్త.

- వాలెంటీర్ భర్త పై కూడా దాడి పాల్పడిన సచివాలయ సిబ్బంది.

- ఫిర్యాదు కూడా స్వీకరించిన దిశా స్టేషన్ అధికారులు.

- దిశా స్టేషన్ ఎదుటే కన్నీరు పెట్టుకున్న బాధిత మహిళా....

2020-08-07 11:11 GMT

కరోనా బారిన పడిన వారిలో అవగాహన కల్పనకు అధికారులు వినూత్న ప్రయత్నం..

శ్రీకాకుళం జిల్లా:

- కోవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారికి మానసిక ఉల్లాసం కోసం వినోద కార్యక్రమాల ఏర్పాటు..

- పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం పరిధిలోని పాత్రునివలస క్వారంటైం సెంటర్ లో ప్రారంభించిన అధికారులు..

- ప్రతీరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఆత్మస్థైర్యం నింపాలని ఆలోచన..

- రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని కేంద్రాల్లో వినోద కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు..

2020-08-07 11:11 GMT

చిత్తూరు జిల్లాలో భారీగా నకిలీ మద్యం పట్టివేత

చిత్తూరు:

- కర్ణాటక నుంచి ఆంధ్రా వైపు తరలిస్తున్న నకిలీ మద్యాన్ని పట్టుకున్న గంగవరం పోలీసులు

- సుమారు ఆరున్నర లక్షల రూపాయలు నకిలీ మద్యం, రెండు కార్లు ,రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

- 7 మంది నిందితుల అరెస్ట్

2020-08-07 11:10 GMT

పోలవరం ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద భారీ చోరీ కి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్..

ప.గో:

- రిపోర్ట్ చేసిన 12 గంటలో కేసును చేదించి ముద్దాయిని అరెస్ట్ చేసిన పోలవరం పోలీసులు....

- నిందితుడు ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరంపాడు కి చెందిన

- పుష్పగిరి మధుసూదన్ రెడ్డి గా గుర్తించిన పోలీసులు ..

- నిందుతుడ్ని వద్ద నుండి రూ. 52,26,016 ఒక మోటార్ సైకిల్ స్వాదీనం...

2020-08-07 11:09 GMT

కేరళ ఆక్టివిస్టు రెహానా ఫాతిమాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..

జాతీయం: 

- అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్‌లతో వివాదంలో చిక్కుకున్న కేరళ ఆక్టివిస్టు రెహానా ఫాతిమాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.

- తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయించాల్సిందిగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం.

- విచారణ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ​కీలక వ్యాఖ్యలు

- “అసలు మీరెందుకు ఇదంతా చేశారు? మీరు ఆక్టివిస్టే కావొచ్చు. అయినంత మాత్రాన ఇలా ఎందుకు ప్రవర్తించారు? సమాజంపై ఇది చాలా దుష్ప్రభావం చూపుతుంది. మీరు అసభ్యతను వ్యాపింపజేస్తున్నారు. అసలు ఇలాంటి చర్యలు ఎదుగుతున్న పిల్లలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసా’’అని అసహనం వ్యక్తం

- రెహానా ఫాతిమా తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌ మాట్లాడుతూ.. తన క్లైంట్‌పై చైల్డ్‌ పోర్నోగ్రఫీ కింద ఆరోపణలు చేయడం సరైంది కాదు

- పురుషులు అర్ధనగ్నంగా కనిపిస్తే లేని అభ్యంతరం మహిళల విషయంలో ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్య.

- కేరళలోని పలు ఆలయాల్లో కొన్ని దేవతా మూర్తులు కూడా అర్ధనగ్నంగా కనిపిస్తాయని.. అయినప్పటికీ ఆలయానికి వెళ్లిన వారిలో లైంగిక ప్రేరేపణ బదులు ఆ విగ్రహాల్లో దైవత్వమే కనిపిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్న రెహానా

2020-08-07 11:06 GMT

కడప :

- మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి ల.పై కడప రిమ్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు...

- జేసీ ప్రభాకర్ రెడ్డి కేంద్ర కారాగారం నుండి బెయిల్ పై విడుదల అవుతున్న సందర్భంలో ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహించారని అభియోగాలు...

- ట్రాఫిక్ జామ్, సెంట్రల్ జైలు నిబంధనల ఉల్లంఘన, కరోనా వైరస్ వ్యాప్తి కి కారణం అయ్యేలా జనసందోహం తరలించడం పై కేసు నమోదు....

- వీటితో పాటు కరోనా నిబంధనలు ఉల్లంఘన కింద కేసు నమోదు చేసిన రిమ్స్ పోలీసులు...

- జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ లతో పాటు మరో 31 మంది పై 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన రిమ్స్ పోలీసులు....

2020-08-07 11:04 GMT

లతీఫ్ మహ్మద్ ఖాన్ మృతికి ప్రగాఢ‌ సంతాపం తెలిపిన నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:

- లతీఫ్ మహ్మద్ ఖాన్ మృతికి ప్రగాఢ‌ సంతాపం తెలిపిన నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ‌ అధ్యక్షులు

- ప్రముఖ పాత్రికేయులు, మున్సిఫ్ ఉర్దూ దినపత్రిక చీఫ్ ఎడిటర్ లతీఫ్ మహ్మద్ ఖాన్ (80) మృతి విచార‌క‌రం.

- పాత్రికేయ ప్రపంచంలో విలువలకు ఆయ‌న‌ దర్పణంగా నిలిచారు.

- దశాబ్దాల పాటు పత్రికా రంగంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.

- వ‌ర్తమాన రాజకీయాలు, సామాజిక పౌర అంశాలపై ల‌తీఫ్ ఖాన్ నిర్మోహమాటంగా అభిప్రాయాలు వెల్లడించేవారు.

- సామాజిక అంశాల ప‌ట్ల‌ ఆయన రాసిన‌ వ్యాసాలు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మార్గదర్శకంగా ఉండేవి.

- నిజాయితీకి, విలువలకు క‌ట్టుబ‌డిన‌ ల‌తీఫ్ ఖాన్ మ‌ర‌ణం పాత్రికేయలోకానికి, పాఠకులకు తీరని లోటు.

- ఆయ‌న‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను.

2020-08-07 11:03 GMT

రాజమండ్రి సెంట్రల్ జైల్లో పాజిటీవ్ ఖైదీలందర్నీ ఒక బ్లాక్ లో క్వారైంటన్

తూర్పుగోదావరి:   

- రాజమండ్రి సెంట్రల్ జైల్లో పాజిటీవ్ ఖైదీలందర్నీ ఒక బ్లాక్ లో క్వారైంటన్ లో వుంచుతాం

- 223 మంది ఖైదీలకు ప్రస్తుతం పాజిటీవ్ సోకిఁది.. జైలు సిబ్బందికి 30మంది కరోనా వచ్చింది

- పది మంది ఖైదీలకు ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రి లో చికిత్స పొఁదుతున్నారు.

- బయట పాజిటీవ్ పేషెంట్స్ కు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తామో లోపల ఖైదీలకు అదే అందిస్తాం

- జిల్లా కలెక్టరు మురళీధర్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ కోమలి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు

- జైల్లో మిగిలిన వారికి కూడా ఈరోజు కూడా టెస్ట్ లు చేస్తున్నాం.. వారిలో మరికొంతమందికి వున్నా అందర్నీ ఒకేచోట పెడతాం

- ఖైదీల బంధువులెవ్వరూ ఆందోళన చెందవద్దని, బయట అందించే ట్రీట్మెంట్ నే జైల్లో ఖైదీలకు అందిస్తాం

- రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్నెంటెండెంట్ రాజారావు

Tags:    

Similar News