Top
logo

Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 07ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చవితి (రాత్రి 12-17 వరకు) తదుపరి పంచమి; పూర్వాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి ఉ. 6-06 వరకు), వర్జ్యం (రా. 11-37 నుంచి 1-22 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-16 నుంచి 9-07 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం 7సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Live Updates

 • తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో విషాదం
  7 Aug 2020 3:33 PM GMT

  తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో విషాదం

  తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో విషాదం

  శానిటైజర్ తాగి నలుగురు మృతి

  మృతుల్లో ఇద్దరు మున్సిపాలిటీ ఉద్యోగులు, మరో ఇద్దరు కూలీలు

 • సింగర్ సునీత పేరు చెప్పి మోసం చేస్తున్న చైతన్య అరెస్ట్
  7 Aug 2020 3:26 PM GMT

  సింగర్ సునీత పేరు చెప్పి మోసం చేస్తున్న చైతన్య అరెస్ట్

   బ్రేకింగ్: 

  సినీ గాయకురాలు సునీత పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో మోసానికి పాల్పడుతున్న చైతన్య ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు...

  అతనిపై కేసు నమోదు చేసి, అతని వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిసింది.

  సింగర్ సునీత చెప్పినట్లుగా ఇటువంటి మోసాలు చేస్తున్న వారు ఇటీవల ఎక్కువైపోయారు.

  అయినా సరే.. సినిమా అవకాశాలు అనగానే కొందరు ఏమీ ఆలోచించకుండా.. నమ్మేస్తున్నారు.

 • 7 గంటలుగా రియాచక్రవర్తి పై ఈడీ విచారణ
  7 Aug 2020 3:20 PM GMT

  7 గంటలుగా రియాచక్రవర్తి పై ఈడీ విచారణ

  జాతీయం: 7 గంటలుగా కొనసాగుతున్న రియాచక్రవర్తి ఈడీ విచారణ

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ్యాంకు ఖాతాల నుండి 15 కోట్ల రూపాయల బదిలీ పై ఈడీ ఆరా

  రియా చక్రవర్తి సోదరుడు, మేనేజర్ ల ను కూడా విచారిస్తున్న ఈడీ అధికారులు

  2019 సంవత్సరానికి గాను రియా చక్రవర్తి ఆదాయ , వ్యయాలపై ఈడీ అధికారుల ప్రశ్నలు

 • ఆసుపత్రి సూపరింటెండెంట్ పై వేధింపుల కేసు
  7 Aug 2020 3:16 PM GMT

  ఆసుపత్రి సూపరింటెండెంట్ పై వేధింపుల కేసు

  విజయవాడ: కొత్త ఆసుపత్రి సూపరింటెండెంట్ నాంచారయ్య పై వేధింపుల కేసు నమోదు...

  - ఆస్పత్రిలో పనిచేసే మహిళా డేటా ఎంట్రీ ఆపరేటర్ పై లైంగిక వేధింపులు...

  - సూపరింటెండెంట్ పై దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఉద్యోగిని...

  - ఆధారాలను పోలీసులకు ఇచ్చిన బాధితురాలు

 • 7 Aug 2020 3:00 PM GMT

  తిరుమల: శ్రీవారి ఆలయ అర్చకులతో సమావేశమైన అదనపు ఈఓ ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీవో హరింద్రనాథ్

 • 7 Aug 2020 12:04 PM GMT

  ఏపీలో టెస్టులు, ట్రేసింగ్‌ భేష్‌.. బ్రిటిష్‌ హైకమిషనర్‌ ప్రశంస

  అమరావతి:

  - ఏపీలో టెస్టులు, ట్రేసింగ్‌ భేష్‌

  - బ్రిటిష్‌ హైకమిషనర్‌ ప్రశంస

  - సీఎం వైయస్‌.జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌

  - అంబులెన్స్‌ల నిర్వహణలో ఇంగ్లండ్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ భాగస్వామ్యం

  - బ్రిటిష్‌ దౌత్యాధికారులతో సీఎం వైయ.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.

  - వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న భారత్‌లో బ్రిటిష్‌ తాత్కాలిక హై కమిషనర్‌ జాన్‌ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌

  - కోవిడ్‌ నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై చర్చ.

  - కోవిడ్‌నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన బ్రిటిష్‌ హైకమిషనర్

 • 7 Aug 2020 12:03 PM GMT

  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై అట్రాసిటీ కేసు నమోదు

  అనంతపురం:

  - తాడిపత్రి టౌన్, రూరల్ పోలీసు స్టేషన్ల లో 5 కేసులు నమోదు చేసిన పోలీసులు

  - దళిత పోలీసు అధికారి ని దూషించిన అభియోగలపై కేసు.

  - కడప నుంచి తాడిపత్రి దాకా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అభియోగాలు.

  - జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఐపీసీ 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు

  - జేసీ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 52 కింద కేసు నమోదు

  - పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి

  - జేసీ అరెస్ట్ సందర్భంగా తాడిపత్రి లో 144 సెక్షన్

  - తాడిపత్రి లో భారీగా పోలీసు బలగాల మోహరింపు.

 • 7 Aug 2020 11:59 AM GMT

  అమరావతి: 

  - రాష్ట్రంలో జిల్లాల పునర్వవస్థీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

  - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు

  - రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన వనరులు, కార్యాచరణపై కమిటీ ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం

 • 7 Aug 2020 11:57 AM GMT

  జిల్లాలో తీవ్రంగా కొనసాగుతున్న కరోనా విజృంభణ..

  శ్రీకాకుళం జిల్లా:

  - 10 వేల మార్కును దాటిన పాజిటివ్ కేసులు సంఖ్య..

  - జిల్లాలో ఇప్పటి వరకు 10,193 కేసులు నమోదు..

  - గడిచిన 24 గంటల్లో నమోదైన 449 పాజిటివ్ కేసులు..

  - కరోనా నుంచి కోలుకుని ఈ రోజు 289 మంది బాధితులు డిశ్చార్జ్..

 • 7 Aug 2020 11:28 AM GMT

  అమరావతి:

  - భారత్‌లో బ్రిటిష్‌ తాత్కాలిక హై కమిషనర్‌ జాన్‌ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో సీఎం వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Next Story